Minister Harish rao : మెడికల్ కాలేజీలు మేం ఏర్పాటు చేస్తే ..అది బీజేపీ ఘనత అని చెప్పుకోవటం సిగ్గు చేటు..

మెడికల్ కాలేజీలకు అనుమతులు విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిందని బీజేపీ చెబుతుంటే కాదు మేమే ఏర్పాటు చేసుకున్నాం దానికి మీ గొప్పలు ఏంటని బీఆర్ఎస్ అంటోంది.

Minister Harish rao : మెడికల్ కాలేజీలు మేం ఏర్పాటు చేస్తే ..అది బీజేపీ ఘనత అని చెప్పుకోవటం సిగ్గు చేటు..

Minister harish rao .. bandi sanjay

Minister Harish rao : కేసీఆర్ పాలన..సంక్షేమంలో స్వర్ణయుగం అంటూ మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ ఉత్సవాలకు మంత్రి హరీశ్‌ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతు..తమ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని అది బీజేపీ ఘనత అని చెప్పుకోవటం సిగ్గుచేటు అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. బీజేపీకి నిజంగా తెలంగాణ అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది ఉంటే వెంటనే విజభన హామీలు నెరవేర్చాలని..రాష్ట్రంలో వెనుకబడిని జిల్లాలకు రావాల్సిన రూ.1300ల కోట్లు కిషన్ రెడ్డి ఇప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇచ్చిందిలేదని..చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలవి నరం లేని నాలుకలని ఎలా వీలైతే అలా మాట్లాడటం వారి నైజం అంటూ విమర్శించారు.

కాగా దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 18 కాలేజీలు తెలుగు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. వీటిలో 13 తెలంగాణకు అనుమతులు ఇచ్చింది. దీనిపై తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.

అదే సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా విమర్శలు చేస్తు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించటంలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటారు.సహకరించపోతే ఇన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందా?దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారు? అంటూ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని..కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పటానికి 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వటం నిదర్శనమన్నారు.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి హరీశ్ రావు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. అది బీజేపీ ఘనత అని చెప్పుకోవటం సిగ్గుచేటని తెలంగాణకు కేంద్రం ఇచ్చింది లేదు చేసింది లేదంటూ తీసిపారేశారు.