Minister Harish Rao : గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది : మంత్రి హరీశ్ రావు

గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తెచ్చాం కనుక 2014లో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు.

Minister Harish Rao : గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది : మంత్రి హరీశ్ రావు

Harish Rao

Minister Harish Rao : గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తెచ్చాం కనుక 2014లో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై మాట్లాడారు.  కావాల్సిన పవన్ ఇచ్చాం కాబట్టి 2018లో ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వాలు పవన్ హాలిడేలు ఇచ్చారు కాబట్టి ప్రజలు కూడా హాలీడేలు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కృష్ణా నదీ నీటి వాటాలో కేంద్రం ఇంకా నాన్చుడు ధోరణిని అవలంభిస్తోందన్నారే. బీజేపీకి ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. కృష్ణా నదీ జలాల్లో వాటా తేలే వరకు పోరాటం చేసి తీరుతామని చెప్పారు.

Telangana Assembly: కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారు: అసెంబ్లీలో హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టును చూసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్టార్ట్ చేసినప్పుడు విపక్షాలు విమర్శించాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఏ పని చేపట్టిన ప్రాణం పెట్టి చేస్తారని కొనియాడారు. విపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో అన్ని రంగాలకు నిధుల్లో కోత పెట్టారని విమర్శించారు.