Telangana : నాడు ఎండాయి, నేడు నీటితో నిండాయి : మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో చెరువుల పండుగ నిర్వహిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పండుగను నిర్వహిస్తోంది. చెరువులు ఎంత ముఖ్యమో..వాటినికి ఎలా కాపాడుకోవాలో చెబుతోంది.

Telangana : నాడు ఎండాయి, నేడు నీటితో నిండాయి : మంత్రి హరీశ్ రావు

Minister harish rao

Telangana Cheruvula Panduga  : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు చెరువుల పండు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆయా ప్రాంత్రాల్లో ఉండే చెరువుల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పండుగ సంబురాల వేళ మంత్రి హరీశ్ రావులో ఉన్న కవి భావుకత రూపంలో బయటపడినట్లున్నాడు. అందుకే చెరువులు,చెలమలు అంటూ ఓ కవితను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

Telangana : తెలంగాణలో చెరువుల పండుగ .. మంత్రి కేటీఆర్‌లో ఎగసిపడిన కవితా కెరటం

నాడు ఎండి పోయిన చెరువులు..
నేడు నిండు కుండల్లా చెరువులు..

నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం..
నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవం..

అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయ్యింది.
అమృత్ సరోవర్ గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది..
“తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది”