Minister Harish Rao Letter : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలన్నారు.

Minister Harish Rao Letter : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ

LETTER

Minister Harish Rao Letter : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. సీఎస్ఎస్ నిధుల విషయంపై నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలన్నారు. 2014-15కు సంబంధించి తెలంగాణకు రావాల్సిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు పొరపాటున ఏపీకి జమ అయ్యాయని పేర్కొన్నారు.

వీటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని కోరారు. దీనిపై గతంలో అనేకసార్లు లేఖలు రాశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా పొరపాటున మొత్తం సీఎస్ఎస్ నిధులను ఏపీకి విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నష్ట పోయిందని లేఖలో పేర్కొన్నారు.

Minister Harish Rao Criticized : నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా..కేంద్రం నిధులు ఇవ్వడం లేదు : మంత్రి హరీష్ రావు

ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర, ఏపీ ప్రభుత్వాలతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 8 ఏళ్లు గడుస్తున్నా రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేయాలని మంత్రి కోరారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరి దిద్దాలన్నారు.