Minister Harish Rao: ఈటల వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు ట్వీట్

గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్ర సర్కారుని ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. తెలంగాణలో వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర సర్కారు వివక్ష చూపిందని ఆరోపించారు. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

Minister Harish Rao: ఈటల వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు ట్వీట్

Minister Harish Rao: తెలంగాణలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు. మెడికల్ కాలేజీలు ఏయే జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్ కే తెలియదని, ఖమ్మం, కరీంనగర్ లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లో కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారని నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను మంత్రి హరీశ్ రావు పోస్ట్ చేశారు.

గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్ర సర్కారుని ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. తెలంగాణలో వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర సర్కారు వివక్ష చూపిందని ఆరోపించారు. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర నిధులతో 12 కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. భారత్ లో ప్రతి లక్ష మందికి 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంపై కేంద్ర సర్కారు, గవర్నర్ తమిళసై సౌందర రాజన్ విమర్శలు చేసే బదులు అభినందించాలని అన్నారు.

కాగా, మెడికల్ కాలేజీలు తెలంగాణలోని ఏయే జిల్లాల్లో ఉన్నాయో సీఎం కేసీఆర్ కే తెలియదని ఇటీవల నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల కేటాయింపు ప్రతిపాదనలపై కేంద్ర సర్కారు స్పందించడం లేదని బీఆర్ఎస్ నేతలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Toll Tax Hike: కేంద్రం మరో బాదుడు.. టోల్ ట్యాక్స్ పెంపునకు రంగం సిద్ధం.. ఏప్రిల్ 1 నుంచి అమలు