Minister HarishRao: ప్రభుత్వాసుపత్రులు ప్రక్షాళన దిశగా కృషిచేస్తున్నాం: ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

ప్రభుత్వాసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్స్ లేక చాలా ఇబ్బంది అవుతోందని..అందుకే రూ.35 కోట్లతో కొత్త భవనం నిర్మాణం..లక్ష చదరపు అడుగులు ఉండేలా కొత్త బిల్డింగ్ శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు

Minister HarishRao: ప్రభుత్వాసుపత్రులు ప్రక్షాళన దిశగా కృషిచేస్తున్నాం: ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

Harish

Minister HarishRao: తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీష్ రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని ప్రభుత్వాసుపత్రిలో శస్త్రచికిత్స పరికరాలను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్స్ లేక చాలా ఇబ్బంది అవుతోందని..అందుకే రూ.35 కోట్లతో కొత్త భవనం నిర్మాణం..లక్ష చదరపు అడుగులు ఉండేలా కొత్త బిల్డింగ్ శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో రూ.2 కోట్లతో సీటీ స్కాన్ ప్రారంభించమని, ENT హాస్పిటల్ లో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన, కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో కొత్త బ్లాక్ ని ప్రారంభించినట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Also Read:Revanth reddy: అప్పుడు మీరెక్కడున్నారు? కవిత, కేటీఆర్ ట్వీట్‌లకు కౌంటర్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి..

ఆసుపత్రుల్లో పరిశుధ్యంపైనా బడ్జెట్ పెంచుకుని, టెండర్ల విషయంలో కూడా కండిషన్స్ మార్చినట్లు మంత్రి తెలిపారు. డైట్ కాంట్రాక్ట్ కూడా మార్చి..పాత కాంట్రాక్ట్ లు రద్దు చేశామని ఇవ్వన్నీ చేయడం వల్ల ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి జీతం పెరగటంతో పాటు..ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంటాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మే 12నుంచి 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత భోజనం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రుల్లో పేషెంట్ తో పాటు అటెండెంట్ కీ రూ.5 లకే భోజనం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఆరోగ్యశాఖలో భారీ మొత్తంలో నియామకాలు పెరగనున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Also Read:Minister Malla reddy : అట్లుంటది ఆయనతోని..మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ..కామెడీగా మారిపోయిందా?

ప్రభుత్వాసుపత్రుల్లో 26 శాతం ప్రసవాలు పెరిగాయని..ప్రతి నెలా ప్రోగ్రెస్ రివ్యూ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. C సెక్షన్ రేట్ తగ్గించేందుకు..సాధారణ డెలివరీలు పెంచేందుకు ఇంసెంటివ్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 రేడియాలజీ ల్యాబ్ లను మే 11న ప్రారంభించనున్నట్లు తెలిపారు. బస్తి దవాఖాన లతో పాటు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్ వాసుల కష్టాలను తీర్చబోతున్నాయని హరీష్ రావు అన్నారు.