Minister KTR: లండన్‌లో కేటీఆర్.. 22ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూశారా?

మంత్రి కేటీఆర్.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అది మంత్రి కేటీఆర్ ఫొటో. ఆ ఫొటో ఇప్పటిది కాదు. 22ఏళ్ల క్రితం లండన్‌లో తీయించుకున్న ఫొటో.. ఇప్పుడు దానిని కేటీఆర్ ట్విటర్ లో షేర్ చేశారు.

Minister KTR: లండన్‌లో కేటీఆర్.. 22ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూశారా?

Minister KTR

Minister KTR: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఉంటారు. మంత్రి హోదాలో నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజాసమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించే కేటీఆర్.. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఆసక్తిక పోస్టులు పెడుతుంటారు. తెలంగాణ ప్రాంతంలోని నెటిజన్లు తమ సమస్యలపై ప్రస్తావించినప్పుడు వాటికి రిప్లయ్ ఇస్తూ, సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. అంతేకాక, కేంద్ర ప్రభుత్వం విధానాలను, ప్రతిపక్ష పార్టీల తీరుపై పోస్టులు పెడుతూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా ట్విటర్ లో మంత్రి కేటీఆర్ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు.

Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో పలు పేరున్న కంపెనీలు పెట్టుబడులు పెట్టడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. పలు దేశాలకు వెళ్లి ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతూ.. హైదరాబాద్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేసేలా కేటీఆర్ చేస్తున్న కృషి అమోఘమనే చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేటీఆర్ లండన్‌లో పర్యటిస్తున్నారు. లండన్ పర్యటనలో ఆయన అక్కడి దిగ్గజ కంపెనీల నాయకత్వాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు.

Minister KTR: తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది.. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలి

ప్రస్తుతం లండన్‌లో ఉన్న కేటీఆర్.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అది మంత్రి కేటీఆర్ ఫొటో. ఇప్పటిది కాదు. కొన్నేళ్లు కేటీఆర్ చదువు, ఉద్యోగం విదేశాల్లో కొనసాగిన విషయం విధితమే. గత 22ఏళ్ల క్రితం కేటీఆర్ లండన్ వెళ్లారు. ఆ సమయంలో అక్కడి ఫోన్ బూత్ నుంచి కేటీఆర్ ఓ ఫోటో తీయించుకున్నారు. అప్పటి ఫొటోను కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ట్వీట్ కు శీర్షికగా.. ‘లండన్ లో 22ఏళ్ల క్రితం’.. ప్రస్తుతం నా లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. నా జ్ఞాపకాలను నెమరవేసుకున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.