Minister KTR In Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులకు మంత్రి కేటీఆర్ వరాలు

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులపై మంత్రి కేటీఆర్ వరాలు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్దులకు టాప్ టాప్ లు అందించిన కేటీఆర్ మరిన్ని వరాలు ప్రకటించారు.

Minister KTR In Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులకు మంత్రి కేటీఆర్ వరాలు

Minister KTR In Basara IIIT

Minister KTR In Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులపై మంత్రి కేటీఆర్ వరాలు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్దులకు టాప్ టాప్ లు అందించిన కేటీఆర్ మరిన్ని వరాలు ప్రకటించారు. క్యాంపస్ కు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా క్యాంపస్ మొత్తం సోలార్ సిస్టం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అలాగే రూ.5 కోట్ల ఖర్చుతో సైన్స్ క్లబ్ ఏర్పాటు చేస్తామని..క్యాంపస్ లో ఉన్న చెరువుని సుందరీకరణ చేస్తామని తెలిపారు. అలాగే క్యాంపస్ లో విద్యార్ధుల వైద్య సౌకర్యం కోసం 10పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని..శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కేవలం హామీలు కావని వీటిని అమలుచేసే బాధ్యత నాదేనని తెలిపారు. ట్రిపుల్ ఐటీకి ఏది అవసరం వచ్చినా నేనున్నానని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు క్యాంపస్ కు వస్తానని హామీ ఇచ్చారు.

కాగా..బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవం సందర్భంగా ఆర్జీయూకేటీ అధికారులతో విద్యాశాఖామంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు సమావేశమయ్యారు. గత పర్యటన సందర్భంగా తామిచ్చిన హామీలు పురోగతిపై మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. క్యాంపస్‌లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతకుముందు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫాంలు అందజేశారు. హాస్టల్‌ బిల్డింగ్‌పై సోలార్‌ ప్లాంటును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అదేవిధంగా మంత్రుల సమక్షంలో టీహబ్‌ ప్రతినిధులు ఆర్జీయూకేటీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకోవాలని వాటి వల్లే పైకి ఎదుగుతారని..ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరు అంటూ విద్యార్ధులకు బూస్టప్ ఇచ్చారు కేటీఆర్. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ కీలక పాత్రపోషిస్తున్నాయని..ఆ దిశగా విద్యార్దులకు కృషి చేయాలని ప్రోత్సహించారు మంత్రి కేటీఆర్.