అబద్ధమైతే మమ్మల్ని శిక్షించండి.. నిజమైతే ఆశీర్వదించండి

  • Published By: vamsi ,Published On : November 19, 2020 / 12:14 PM IST
అబద్ధమైతే మమ్మల్ని శిక్షించండి.. నిజమైతే ఆశీర్వదించండి

గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. హైద‌రాబాద్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు ప‌టిష్టంగా ఉన్నాయ‌ని, ఇబ్బంది పెట్టేందుకు చూసే వ్యక్తులను సహించేది లేదని హెచ్చరించారు. న‌గ‌రంలోని సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ‘మీట్ ది ప్రెస్‌’ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే వారు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని సూచించారు.



ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పేకాట క్ల‌బుల్లు లేవు.. గుడుంబా గ‌బ్బు లేదు.. బాంబు పేలుళ్లు లేవు.. మ‌త క‌ల్లోలాలు లేవు.. అల్ల‌ర్లు లేవు.. ఆక‌తాయిల‌ ఆగ‌డాలు లేవు.. పోకిరీల గొడవలు లేవు. ఇదే కదా? ప్రశాంతత అంటే.. చెప్పినవి అన్నీ వాస్త‌వం కాదా? అని ప్రశ్నించారు కేటీఆర్. CC కెమెరాల ఏర్పాటులో దేశంలో హైద‌రాబాద్ అగ్ర‌స్థానంలో ఉందని, ప్ర‌పంచంలో హైద‌రాబాద్ 16వ స్థానంలో ఉంద‌ని అన్నారు. దేశంలో 65 శాతం సీసీ కెమెరాలు హైద‌రాబాద్‌లో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు.



https://10tv.in/ghmc-elections-2020-mask-compulsory-to-vote/
హైద‌రాబాద్‌లో 5 ల‌క్ష‌ల సీసీ కెమెరాలు ప్రస్తుతం ఉండగా.. వాటిని 10 ల‌క్ష‌ల‌కు పెంచి, అన్నింటినీ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు అనుసంధానం చేస్తామ‌ని అన్నారు. సెక్యురిటీ విషయంలో దేశం మొత్తం మనవైపు చూస్తా ఉంది అని, తెలంగాణ ఆగమాగం అయ్యే దశలో లేదని కేటీఆర్ అన్నారు. మేం చెప్పింది అబద్ధమైతే మమ్మల్ని శిక్షించండి.. నిజమైతే ఆశీర్వదించండి..అని కేటీఆర్ ప్రజలను కోరారు. శాంతి భద్రత విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గే ప్రశక్తే లేదని, అసాంఘీక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తాం అని అన్నారు.