KTR Challenge : దమ్ముంటే మళ్లీ గెలవండి.. బండి సంజయ్, రఘునందన్‌కు కేటీఆర్ సవాల్

ముందు.. బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపమనండి. తర్వాతి విషయాలు తర్వాత. నోరు తెరిస్తే కూలుస్తాం, జైలుకి పంపుతాం అని బీజేపీ నేతలు అంటారు.

KTR Challenge : దమ్ముంటే మళ్లీ గెలవండి.. బండి సంజయ్, రఘునందన్‌కు కేటీఆర్ సవాల్

KTR Challenge : మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆప్టిక్స్ అండ్ ఇల్యూషన్స్ థియరీ, టీఆర్ఎస్ లో బీజేపీ కోవర్టుల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

టెన్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో బీజేపీ నేతలు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆప్టిక్స్ అండ్ ఇల్యూషన్స్ థియరీ, టీఆర్ఎస్ లో బీజేపీ కోవర్టులు, టీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు మాతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

”ముందు.. బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపమనండి. తర్వాతి విషయాలు తర్వాత. నోరు తెరిస్తే కూలుస్తాం, జైలుకి పంపుతాం అని బీజేపీ నేతలు అంటారు. ప్రజలు వారి నుంచి ఇది కాదు కోరుకునేది. కేసీఆర్ కంటే తెలంగాణను బీజేపీ నేతలు ఎక్కువ ప్రేమించాలి. అప్పుడే ప్రజల మనసు గెలుచుకోగలరు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కేసీఆర్ కంటే తెలంగాణకు ఎక్కువ చేయాలి. మేము ఒక మంచి పని చేస్తే, బీజేపీ వాళ్లు రెండు మంచి పనులు చేయాలి. నరేంద్ర మోదీకి చెప్పండి. పనికిమాలిన పనులు చేయకు, ప్రజలకు పనికొచ్చే పనులు చేయమని చెప్పండి. తెలంగాణకు మేము 33 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. బీజేపీ వాళ్లు ఒక వంద 50 పాఠశాలలు పెట్టండి కొత్తవి. మేము వద్దంటామా. 150 ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టండి. మేము వద్దన్నామా.

ఒక వ్యక్తికి రూ.18వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం ఎందుకు? మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అదివ్వరు. కానీ ఒక వ్యక్తికి రూ.18వేల కోట్లు ఇస్తారు. దాని బదులు మొత్తం నల్గొండ జిల్లా ప్రజలకు ఇచ్చుంటే హర్షించే వారు కదా. బీజేపీ బలం పెరిగుండేది కదా.

తెలంగాకు ఓ లక్ష కోట్లు ప్రకటించండి. గత 5 నెలల్లో ప్రధాని మోదీ 18సార్లు గుజరాత్ వెళ్లి అక్కడ లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అందులో సగమైనా తెలంగాణకు ఇవ్వొచ్చు కదా. ప్రజల మనసు గెలుచుకోవడానికి పాజిటివ్ పాలిటిక్స్ చేయొచ్చు. లేదా నెగిటివ్ పాలిటిక్స్ చేయొచ్చు. బీజేపీ వాళ్లు ఆధారపడింది నెగిటివ్ పాలిటిక్స్ మీద. కోవర్టు రాజకీయాల మీద” అని బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు కేటీఆర్.