Minister KTR : బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్.. ‘దమ్ముంటే గంగుల కమలాకర్ పై పోటీ చెయ్’

గంగుల కమలాకర్ పై పోటీ చేసే సత్తా బండి సంజయ్ కు ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటి చేయాలన్నారు.

Minister KTR : బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్.. ‘దమ్ముంటే గంగుల కమలాకర్ పై పోటీ చెయ్’

Ktr Challenge

KTR challenged Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే గంగుల కమలాకర్ పై పోటీ చేయాలన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి బండి సంజయ్ ఎంపీగా గెలిచారని పేర్కొన్నారు. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బతో ఎంపీగా గెలిచారని ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ పై పోటీ చేసే సత్తా బండి సంజయ్ కు ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటి చేయాలన్నారు. కమలాకర్ ను ఈసారి లక్ష ఓట్లతో గెలిపించాలని కోరారు.

ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి మూడేళ్ల అవుతోందని, కనీసం.. మూడు కోట్ల పనులు చేశావా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడారా అని నిలదీశారు. ఎప్పుడూ హిందూ, ముస్లిం గురించి మాట్లాడుతున్న సంజయ్.. కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించారు.

Minister KTR : రూ.46 వేల కోట్లతో ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నాం : మంత్రి కేటీఆర్

అభివృద్ధి కోసం పోటీపడుతామని, రాజకీయాలు అవసరం లేదన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఉందన్నారు. కేంద్ర మంత్రులు అసమర్థులని విమర్శించారు. సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై పోటీ చేయాలని సవాల్ చేశారు. కమలాకర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

తాము మెడికల్ కాలేజీ తెచ్చామని.. మీరు ఒక్క ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నీక్ కాలేజీ తెచ్చారా అంటూ నిలదీశారు. తెల్లవారితే హిందూ ముస్లింలు అంటావ్..ఒక్క గుడి అయిన తెచ్చావా అంటూ ప్రశ్నించారు. నేదునూరి గ్యాస్ ప్లాంట్ కోసం కేంద్రం ఏమి చేయలేదని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.