Minister KTR: తెలంగాణ వంటి పాలన దేశంలోనే లేదు: మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

Minister KTR: తెలంగాణ వంటి పాలన దేశంలోనే లేదు: మంత్రి కేటీఆర్

Ktr

Minister KTR: అరవై ఏండ్ల కాలంలో ఎంతో మంది సీఎంలు వచ్చి తెలంగాణ కోసం చేసిందేమి లేదని..ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈసందర్భంగా 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఏ పల్లెల్లోనైనా.. ఎక్కడైనా.. తెలంగాణ వంటి అభివృద్ధిని చూపిస్తారా..అని ప్రశ్నించిన కేటీఆర్.. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత త్వరగా అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు.

Also read: Horse Racing: ఆన్‌లైన్‌లో గుర్రపు పందేలు నిర్వహిస్తున్న ముఠా సభ్యులు అరెస్ట్

గౌరవ ప్రదమైన పించన్ ఇచ్చి వృద్ధుల గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని.. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్ల వల్లే ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు పెరిగాయని మంత్రి తెలిపారు. మొన్న బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ ఆవేదనతో.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదని కేటీఆర్ అన్నారు. కేంద్రం కలసి వచ్చినా రాక పోయినా.. మీ ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వము వెనకడుగు వేయలేదు.. వేయదని అన్నారు.

Also read: World Cancer day : మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ గురించి పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు..మిషన్ భగీరథ వల్ల ఇక నల్గొండలో ఫ్లోరోసిస్ రాదని కేంద్ర పెద్దలే జవాబు చెప్పరాని..అటువంటి ముందుచూపు పాలన సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే దుందుభి నదిపై చెక్ డ్యామ్ లు కట్టిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్.. నిరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు.

Also read: Medaram Jatara : మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్