Minister KTR: బీజేపీ నేతలకు ఆ దమ్ముందా?: మంత్రి కేటీఆర్ విమర్శలు

ప్రజల కోసం తాము ఏమి చేశామో ప్రతి గ్రామంలో రెండు గంటల చొప్పున చెప్పే దమ్ము తమకు ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలకు ఆ దమ్ముందా? అని నిలదీశారు. దొంగ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుడు ప్రభుత్వాలను కూల్చుడే మోదీ పాలన అని కేటీఆర్ విమర్శించారు. కేవలం మతపరమైన పంచాయితీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. మోడీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ( ఖరీదైన) ప్రధాని అని చురకలంటించారు.

Minister KTR: బీజేపీ నేతలకు ఆ దమ్ముందా?: మంత్రి కేటీఆర్ విమర్శలు

Minister KTR

Minister KTR: ప్రజల కోసం తాము ఏమి చేశామో ప్రతి గ్రామంలో రెండు గంటల చొప్పున చెప్పే దమ్ము తమకు ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలకు ఆ దమ్ముందా? అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎకరాకు కనీసం రెండు రూపాయల లాభం కూడా లేదని చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.

దొంగ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుడు ప్రభుత్వాలను కూల్చుడే మోదీ పాలన అని కేటీఆర్ విమర్శించారు. కేవలం మతపరమైన పంచాయితీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ( ఖరీదైన) ప్రధాని అని చురకలంటించారు. రూ.18,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏ వర్గానికి ఏం చేసింది? అని నిలదీశారు.

ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని, అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని అన్నారు. తెలంగాణలో నాడు గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని చెప్పారు. 65 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేయలేని పనులు ఇప్పుడు చేస్తున్నామని అన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని అన్నారు. కేంద్రం ఏ అవార్డులు ప్రకటించినా ఎర్రబెల్లి నాయకత్వం వహిస్తున్న శాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. మంత్రి కృషి, అధికారుల పనితీరు వల్లే ఇలాంటి గుర్తింపు లభించిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి పాఠాలు నేర్పిస్తుందని అన్నారు. తొర్రూరు మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు ప్రకటించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడని, ఆయనను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజక వర్గం సిరిసిల్ల కంటే పాలకుర్తిలో దయాకర్ రావును ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

Delhi Liquor Scam: ఢిల్లీకి బయల్దేరిన కవిత… కీలక సూచనలు చేసిన సీఎం కేసీఆర్