ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

  • Published By: bheemraj ,Published On : December 1, 2020 / 07:52 AM IST
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

KTR right to vote : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మంత్రి కేటీఆర్ క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని 8 వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి ఓటు వేశారు. నేతలంతా ఒక్కొక్కొరిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబుతున్నారు.



సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం డివిజన్లు 150…బరిలో 1122 మంది అభ్యర్థులు ఉన్నారు. 9,101 పోలింగ్ బూత్ లు , 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.



ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినిగియోగించుకునే అవకాశం కల్పించారు.