Telangana : బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారు : కేటీఆర్

బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు.

Telangana : బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారు : కేటీఆర్

Bangalore ‘dodda Ganapathi’ Temple Police Notice (1)

Telangana : తెలంగాణలో గులాబీ వర్సెస్ కాషాయం అన్నట్లుగా జగడాలు కొనసాగుతున్నాయి.టీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు ప్రతివిమర్శలతో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈక్రమంలో బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓట్లు వేసి గెలిపించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పటానికి ఏమీ లేదని..డబ్బాలో రాళ్లేసి ఊపినట్లే బీజేపీ పాలన ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.తెలంగాణకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో చెప్పే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు.

Also read : KCR-Kishan Reddy : మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధం..కేసీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి

దళితులకు సంవత్సరానికి రూ.300లు ఇచ్చి పేద్ద ఏదో ఇచ్చేసినట్లే బీజేపీ గప్పాలు కొడుతోందని రూ.300లతో పండగ చేసుకోవాలంటోందని అదే తెలంగాణలో రైతులకు,దళితులకు ఇచ్చేదానితోపోలిస్తే కేంద్రం ఇచ్చేంది ఎంత?అని ప్రశ్నించారు. తెలంగాణ వృద్ది రేటులో ఎలా ఉందో కాస్త తెలుసుకోవాలని బీజేపీకి సూచించారు కేటీఆర్. దళితులపైనా, రైతులపైనా బీజేపీ ప్రభుత్వానాకి ఎటువంటి ప్రేమ లేదని రైతు బంధును ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రైతుల కష్టాన్ని కొనలేక చేతులెత్తేసిన బీజేపీ ప్రభుత్వమా మమ్మల్ని విమర్శించేది అంటూ మండిపడ్డారు కేటీఆర్.

Also read : Jagadish Reddy-kishan Reddy : దేశానికి గర్వంగా చెప్పుకునే ఒక్క ప్రాజెక్టు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా..?

దేశంలో అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన ఘనత బీజేపీది కాదా? అని ప్రశ్నించారు. ఎల్ ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? మీ స్వార్థం కోసం కాదా? దీనిపై సమాధానం చెప్పే దమ్ము బీజేపీకి లేదని ఎద్దేవా చేశారు. జీవితాలను మార్చమని అధికారమిస్తే జీవత బీమానే అమ్మేస్తున్నారని..ఇది బీజేపీ ఘనత అని అన్నారు.

Also read : Harish Rao : దమ్ముంటే.. అంబర్ పేట చౌరస్తాకు రా.. కిషన్ రెడ్డికి హరీశ్ సవాల్

తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాక చేనేత కారుల మొహాల్లో వెల్లివిరిసే ఆనందాన్ని..మత్య్సకారులు మొహాల్లో వెలుగొందే ఆనందాన్ని చూసి బీజేపీ ఓర్చుకోలేకపోతోందని అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని..తెలంగాణలో పరుగులు పెడుతున్న వృద్ధి రేటును చూడలేక పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.

Also read : Bangalore Temple bell : గుడిలో గంట‌లు మోగించొద్దంటూ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు..నోటీసులు జారీ..!!