KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్

ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? మీ స్టీరింగే కార్పొరేట్ల చేతిలో ఉంది..(KTR Fires On AmitShah)

KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్

Ktr Fires On Amitshah

KTR Fires On AmitShah : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. తుక్కుగూడ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేతలు చేసిన తీవ్ర విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.

Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా

అమిత్ షా సహా బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. అమిత్ షా కాదు.. ఆయన అబద్దాల బాద్ షా అని కేటీఆర్ అభివర్ణించారు. తుక్కుగూడలో బీజేపీ ఇచ్చింది తుక్కు డిక్లరేషన్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తుక్కుగూడలో బీజేపీ నేతలు చెప్పినవన్నీ తుక్కు మాటలే అన్నారు. అమిత్ షా మాటలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని అన్నారు.

Amit Shah

Amit Shah

ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. తెలంగాణ అప్పులు చేసినా పరిమితికి లోబడే చేసిందన్నారు కేటీఆర్. కామన్ సెన్స్ లేకుండా ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో రాజకీయ పర్యాటకుల సందడి పెరిగింది అంటూ పరోక్షంగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.(KTR Fires On AmitShah)

Amit Shah (1)

Amit Shah (1)

దేశాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? అని కేటీఆర్ ప్రశ్నించారు. మేము అప్పు చేసినా, మిషన్ భగీరథకు ఉపయోగించాము అని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై రూ.26లక్షల కోట్లు వసూలు చేయలేదా? అని అడిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపి కార్పొరేట్ల అప్పులు మాఫీలు చేయలేదా? అని కేటీఆర్ నిలదీశారు.(KTR Fires On AmitShah)

Minister talasani: ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం

టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ బీజేపీ నేతలు చేసిన విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. మా స్టీరింగ్ ఎంఐఎం చేతిలో కాదు.. మీ స్టీరింగే కార్పొరేట్ల చేతిలో ఉందని ఎదురుదాడికి దిగారు. ఏ ఇద్దరి చేతిలో బీజేపీ స్టీరింగ్ ఉందో దేశం మొత్తం తెలుసు అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డం పెట్టుకుని ఆటలు సాగిస్తున్నారని మండిపడ్డారు. అయితే, ప్రజాస్వామ్యంలో ఆటలు ఎక్కువ కాలం సాగవు అని హెచ్చరించారు.

Ktr

Ktr

నీళ్లు, నిధులు, నియామకాల గురించి కేంద్రానికి ఏం తెలుసు అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్న కేటీఆర్.. ఇదేనా మీ నీతి? అని నిలదీశారు. ఇంటింటికి నళ్లా ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. మేం స్టారప్ అంటున్నాం, వాళ్లేమో ప్యాకప్ అంటున్నారు అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఎల్ఐసీతో సహా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి.. ప్రైవేట్ సంస్థల్లో పెటుబడులు పెడతారా? కేంద్రం బిజినెస్ చేయదు అంటూనే.. ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారు? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.(KTR Fires On AmitShah)

Amit Shah On MinorityReservations : అధికారంలోకి వ‌చ్చాక‌.. మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు-అమిత్ షా సంచలన ప్రకటన