గాంధీభవన్‌కు రేపో, మాపో TOLET బోర్డు పెట్టుకోవడమే, హైదరాబాద్ అభివృద్ది కోసం రూ.67వేల కోట్లు ఖర్చు చేశాం

10TV Telugu News

కాంగ్రెస్ పై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి ఫైర్ అయ్యారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచం మొత్తం తెలంగాణను గుర్తిస్తున్నా కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.67వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో కూర్చుని మాట్లాడటం కాదు, గల్లీలో తిరగాలని, జరిగిన అభివృద్ధిని చూడాలని కేటీఆర్ సూచించారు. హైదరబాద్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు నిరాశతో మాట్లాడుతున్నారని చెప్పిన కేటీఆర్.. రేపో, మాపో గాంధీభవన్ కు టూలెట్ బోర్డు పెట్టుకోవడమే అని ఎద్దేవా చేశారు.


https://10tv.in/durgam-cheruvu-cable-bridge/

10TV Telugu News