KTR : సబ్ కా సాథ్ కాదు.. సబ్ కా సత్యనాష్ – జేపీ నడ్డాపై కేటీఆర్ ఫైర్

బీజేపీ అంటే బక్ వాస్ జుమ్లా పార్టీ అని అభివర్ణించారు. ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయన్నారు.

KTR : సబ్ కా సాథ్ కాదు.. సబ్ కా సత్యనాష్ – జేపీ నడ్డాపై కేటీఆర్ ఫైర్

Ktr

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి బయటపెడతాం, విచారణ జరుపుతాం అంటూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.

బండి సంజయ్ కి జేపీ నడ్డాకు తేడా లేదన్నారు కేటీఆర్. ఏడేళ్లలో బీజేపీ దేశానికి చేసేందేమీ లేదని విమర్శించారు. యూపీ ఎన్నికల్లో అభివృద్ధిని చూపి బీజేపీ ఓటు అడగకపోవడం విడ్డూరం అన్నారు. బీజేపీ అంటే బక్ వాస్ జుమ్లా పార్టీ అని అభివర్ణించారు. ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయన్నారు.

Amazon Deal: 48MP స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందవచ్చు.. ఆఫర్ తెలుసుకోండి!

పంజాబ్ లో రైతులు అడ్డుకుంటే ప్రధాని మోదీ అరగంట ఆగారని చెప్పిన కేటీఆర్.. దేశంలో ఏ ప్రధానికి ఈ పరిస్థితి ఎదురుకాలేదన్నారు. జుమ్లా అని ఎవరన్నా…. వారి పై హంలా జరుగుతుందన్నారు. కేంద్రంలో 15లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా జోనల్ వ్యవస్థ కోసం మమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారని కేటీఆర్ అన్నారు.

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్‌ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!

”నడ్డాకు కేరాఫ్ అడ్డ ఎర్రగడ్డ. పార్లమెంటులో సమాధానం ఇచ్చిన మంత్రి మెంటల్ బాలన్స్ తప్పిందా… నడ్డాది తప్పిందా? తేల్చుకోవాలి. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ పోయి… సబ్ కా వినాష్.. సత్యనాష్ లా పరిస్థితి తయారైంది. కిసాన్ సమ్మన్, హర్ ఘర్ జల్ కు స్ఫూర్తి ఎవరు? మా ప్రభుత్వ విధానాలు….మీ ఎన్నికల నినాదాలు. నిన్న రైతులను… నేడు ఉద్యోగులను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు. గాడ్సే గొప్ప అని చెప్పే బీజేపీ…గాంధీకి దండలు వేయడం హాస్యాస్పదం. 8 రాష్ట్రాల్లో మెజారిటీ రాక పోయినా అధికారంలో ఉండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరం. బండి పోతే… బండి ఫ్రీ వస్తుంది…గుండు పోతే ? ప్రజల తరపున కొట్లాడుతాం… వెంటాడుతాం. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నదే లక్ష్యం. మాకు ఉద్యోగులకు పేగు బంధం” అని కేటీఆర్ అన్నారు.