Minister KTR : మూడో వేవ్ వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం : కేటీఆర్

కరోనా వైరస్ కట్టిడిలో  తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని పురపాలక ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు ఆయన గచ్చిబౌలీ టిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 150 కరోనా పడకలను ప్రారంభించారు.

10TV Telugu News

Minister KTR :  కరోనా వైరస్ కట్టిడిలో  తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని పురపాలక ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు ఆయన గచ్చిబౌలీ టిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 150 కరోనా పడకలను ప్రారంభించారు. హైసియా సభ్యులు రూ. 15 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుత లాక్‌డౌన్ ముగిసేలోగా రెండో ద‌శ తీవ్ర‌త త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్రజలు మళ్లీ సాధార‌ణ జీవ‌నం గ‌డిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వైద్యులు అంచ‌నా వేస్తున్నారు అని తెలిపారు.

క‌రోనా విజృంభించిన‌ప్ప‌టి నుంచి విరామం లేకుండా వైద్య సేవ‌లందిస్తున్న వైద్య సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మూడవ దశ వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని కేటీఆర్ చెప్పారు. ఇంటింటి స‌ర్వే ద్వారా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. సూప‌ర్ స్ర్పెడ‌ర్ల‌కు ప్రాధాన్య‌తా క్ర‌మంలో టీకాలు ఇస్తున్నామ‌ని తెలిపారు.

హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉందని కేటీఆర్ అన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల మంద‌కొడిగా వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుంద‌న్నారు. విదేశాల్లో 50 కోట్ల ఆస్ర్టాజెనికా డోసులు నిరూప‌యోగంగా ఉన్నాయ‌న్నారు. టీకాలు కొన‌కుండా ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేశారు. పావ‌లా శాతం టీకాలు లేకుండా ఎగుమ‌తి చేప‌ట్టారు. ఇక‌నైనా కేంద్రం మేల్కొని విదేశాల్లోని టీకాలు తెప్పించాల‌ని సూచించారు.

10TV Telugu News