Minister KTR : రూ.46 వేల కోట్లతో ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నాం : మంత్రి కేటీఆర్

మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్.. మంచినీటి సరఫరా పనులను ప్రారంభించారు. చొప్పదండిలో రూ.35 కోట్లతో నిర్మించే మున్సిపల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

Minister KTR : రూ.46 వేల కోట్లతో ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నాం : మంత్రి కేటీఆర్

Ktr

Maneru Riverfront works : నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ కొట్లాడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు నీళ్లు కావాలంటూ కరీంనగర్ కొట్లాడిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. రూ.46 వేల కోట్లతో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.610 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్తాపన చేశారు.

మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్.. మంచినీటి సరఫరా పనులను ప్రారంభించారు. చొప్పదండిలో రూ.35 కోట్లతో నిర్మించే మున్సిపల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.5 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ ను ప్రారంభించారు. జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతోందన్నారు.

తెలంగాణలో మాతా శిశు మరణాలు తగ్గాయని చెప్పారు. కరీంనగర్ మెడికల్ కాలేజీ కలను కేసీఆర్ నెరవేర్చారని తెలిపారు. కరీంనగర్ కు 1600 డబుల్ బెడ్ రూమ్ లు మంజూరైతే 1400 పూర్తయ్యాయని తెలిపారు. అవసరమైతే అదనంగా రెండు, మూడు వేల ఇళ్లను మంజూరు చేపించే బాధ్యత తనదని అన్నారు. ఎంపీగా గెలిచిన ఆయన మూడేళ్లు అవుతుంది.. కరీంనగర్ కోసం మూడు కోట్ల పని అయినా చేశారా అని ప్రశ్నించారు. మెగా పవర్ లూం క్లస్టర్ కావాలని అడుగుతున్నారని,, వారికేమైన చేశారా అని నిలదీశారు.

Minister KTR : కంటోన్మెంట్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్.. ‘మంచినీళ్లు, క‌రెంట్ బంద్ చేస్తాం’

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో ఒక్కసారైనా ఎంపీ నోరుతెరిచారా అని ప్రశ్నించారు. తాము మెడికల్ కాలేజీ తెచ్చాం… మీరు ఒక్క ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నీక్ కాలేజీ తెచ్చావా అంటూ నిలదీశారు. తెల్లవారితే హిందూ ముస్లింలు అంటావ్..ఒక్క గుడి అయిన తెచ్చావా అంటూ ప్రశ్నించారు. నేదునూరి గ్యాస్ ప్లాంట్ కోసం కేంద్రం ఏమి చేయలేదని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.