Haritha Haram : ఆక్సిజన్ పెరగాలంటే మొక్కలు నాటాలి : మంత్రి కేటీఆర్

ఆక్సిజన్ పెరగాలంటే మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏవ విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ పెరగాలంటే హరితహారాన్ని మించిన కార్యక్రమం లేదని అన్నారు.

Haritha Haram : ఆక్సిజన్ పెరగాలంటే మొక్కలు నాటాలి : మంత్రి కేటీఆర్

Minister Ktr In Haritaharam

Harita Haram In Telangana : పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం ప్రతీ సంవత్సరం కొనసాగుతోంది.దీంట్లో భాగంగా ఈరోజు మంత్రి కేటీఆర్ ఏడవ విడత హరిహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వానలు పడటం ప్రారంభం అయ్యాక హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో మంత్రి కేటీఆర్ పెద్దఅంబర్‌పేట కలాన్‌లోని ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా కేటీఆర్ రావి మొక్కను నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆక్సిజన్ పెరగాలంటే మొక్కలు నాటాలని ప్రతీఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పెంచి పెద్ద చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆక్సిజన్ పెరగాలంటే హరితహారాన్ని మించిన కార్యక్రమం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. హరిత హారం కార్యక్రమాలకు ఇప్పటి వరకూ రూ.5,900ల కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు.

ఈ హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్క్‌లో మొక్కలు నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి పాల్గొన్నారు.