Minister KTR : బీజేపీ, కాంగ్రెస్ సర్వేలు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందనే చెప్పాయి : కేటీఆర్

టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయం...మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవ్వటం ఖాయం..కాంగ్రెస్, బీజేపీ స‌ర్వేలే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మొన్నటి బీజేపీ సర్వే..నిన్నటి కాంగ్రెస్ సర్వేలే టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెబుతున్నాయని కేటీఆర్ తెలిపారు.

Minister KTR : బీజేపీ, కాంగ్రెస్ సర్వేలు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందనే చెప్పాయి : కేటీఆర్

Minister Ktr On Comments On General Elections

Minister KTR : టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయం…మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవ్వటం ఖాయం..కాంగ్రెస్, బీజేపీ స‌ర్వేలే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మొన్నటి బీజేపీ సర్వే..నిన్నటి కాంగ్రెస్ సర్వేలే టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెబుతున్నాయని కేటీఆర్ తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుస్త‌ద‌ని ప్ర‌త్య‌ర్థులు కూడా ఒప్పుకుంటున్నార‌ని..ఎనిమిదేళ్ల పాలనలో ప్ర‌జ‌ల మంచి వచ్చిన స్పంద‌న ఫలితమే ఈ సర్వేలు అని తెలిపారు.

90 సీట్లు మావే..
ఇక ముందుస్తు ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతూ..ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశమే లేదన్నారు..ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా..గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తంచేశారు. మాకున్న సమాచారాన్ని బట్టి టీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం కరెక్ట్ కాదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి అని కేటీఆర్ తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందితే గడ్డం తీసేస్తానని శబధాలు చేసినవారు గడ్డానికి రంగులేసుకుని తిరుగుతున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ ను ఉద్ధేశించి ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇకపోతే రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాజకీయ సన్యాసం తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కు రాష్ట్రం అంతటా విస్తరించి ఉందని కానీ బీజేపీ కాంగ్రెస్ లు మాత్రం లేవని అన్నారు. తెలంగాణలోనే కాదు కాదు కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేదని అన్నారు. అంతేకాదు భవిష్యత్ లో కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు షాక్ తప్పదన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ లోనే గెలవలేదు. ఇకెంకడ గెలుస్తారు అసలా ఛాన్సే లేదరు అన్న కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి పథనంలో పయనిస్తోందని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని సూచించారు. సిరిసిల్లలో అభివృద్ధిని చూసి రాహుల్ గాంధీ నేర్చుకోవాలని అంటూ సూచించారు.

అలాగే కొత్తగా వచ్చిన మరో పార్టీ అధినేత షర్మిల కూడా తెలంగాణలో కొన్ని చోట్ల ఉన్నారంటూ ముక్తాయించారు. బ‌లంగా ఉన్న నేత‌ల‌ను పార్టీ క‌లుపుకొని పోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ ఒక్క పార్టీయే రాష్ట్రం అంత‌టా ఉంద‌న్నారు. టీఆర్ఎస్ పార్టీకి 90కి పైగా స్థానాలు వ‌స్తాయ‌ని త‌మ స‌ర్వే చెబుతుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు..
షెడ్యూల్ ప్ర‌కార‌మే 2023లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వాళ్లు తేదీ ప్ర‌క‌టిస్తే అసెంబ్లీ ర‌ద్దు చేస్తామ‌ని సీఎం చెప్పారు. కానీ బీజేపీ నుంచి స్పంద‌న లేద‌న్నారు కేటీఆర్. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు ఈసీ కూడా కేంద్రం చేతిలో ఉంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.