KTR Tweet: మోదీజీ మీరైనా ఆ పనిచేయండి.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించండి.. మంత్రి కేటీఆర్ ట్వీట్

మంత్రి కేటీఆర్ ట్విటర్ లో 2004 నాటి ఫొటోను షేర్ చేశారు. కేంద్రంలో ఓబీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు 2004 నుంచి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

KTR Tweet: మోదీజీ మీరైనా ఆ పనిచేయండి.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించండి.. మంత్రి కేటీఆర్ ట్వీట్

Minister Ktr

KTR Tweet: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపైఒకరు విమర్శలతో నిత్యం తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓబీసీకి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విటర్ వేదికగా కోరారు.

Minister KTR: ప్రశ్నించే వారిని కేంద్రం అణగదొక్కుతోంది

మంత్రి కేటీఆర్ ట్విటర్ లో 2004 నాటి ఫొటోను షేర్ చేశారు. కేంద్రంలో ఓబీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు 2004 నుంచి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ నేతృత్వంలో ఓబీసీ సంఘాలు ఢిల్లీకి వెళ్లారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ ఓబీసీ సంఘాల నేతలతో కలిసి కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

2004లో కేసీఆర్, ఓబీసీ సంఘాల విజ్ఞప్తిని యూపీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీని కూడా కోరామని, శాఖ ఏర్పాటు చేసి వచ్చే బడ్జెట్ లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ తన ట్విటర్ లో పేర్కొన్నారు.