Minister KTR : చైనాకు షెన్‌జెన్-ఇండియాకు హైదరాబాద్.. చైనా సాధించిన అభివృద్ధిని ఇక్కడ చూపిస్తాం-మంత్రి కేటీఆర్

చైనాకు షెన్ జెన్ మాదిరి ఇండియాకు హైదరాబాద్ మరో షెన్ జెన్ అవుతుందన్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. చైనా సాధించిన అభివృద్ధిని.. హైదరాబాద్ లో సాధించి చూపుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.(Minister KTR)

Minister KTR : చైనాకు షెన్‌జెన్-ఇండియాకు హైదరాబాద్.. చైనా సాధించిన అభివృద్ధిని ఇక్కడ చూపిస్తాం-మంత్రి కేటీఆర్

Minister KTR : చైనాకు షెన్ జెన్ మాదిరి ఇండియాకు హైదరాబాద్ మరో షెన్ జెన్ అవుతుందన్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. చైనా సాధించిన అభివృద్ధిని.. హైదరాబాద్ లో సాధించి చూపుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.

ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కాదన్న కేటీఆర్.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్‌ అని ఐటీకి సరికొత్త నిర్వచనం చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పన కోసం తెలంగాణ ఫైట్ చేస్తోందన్నారు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ హైదరాబాద్ అన్నారు. సాఫ్ట్ వేర్ లో ఇండియా పవర్ హౌస్ అయితే.. తైవాన్ హార్డ్ వేర్ పవర్ హౌస్ అన్నారు. రెండూ కలిస్తే ప్రపంచానికి ఎంతో పరిజ్ఞానం ఇవ్వొచ్చన్నారు. కోవిడ్ సమయంలో టీ-వర్క్స్ వెంటిలేటర్లను అందించిందని కేటీఆర్ తెలిపారు.

Foxconn Chairman Young Liu : వావ్.. వాటే డెవలప్‌మెంట్, తెలంగాణలో అభివృద్ధిపై ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీయు ప్రశంసలు

”సాఫ్ట్‌వేర్‌కు ఇండియా ప‌వ‌ర్ హౌస్ లాంటిది. తైవాన్ దేశం హార్డ్ వేర్ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. రెండు దేశాలు క‌లిసి ప‌ని చేస్తే ప్ర‌పంచానికి చాలా ఇవ్వొచ్చు” అని టీ-వ‌ర్క్స్ ప్రారంభోత్స‌వం అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ అన్నారు.

దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్ ను ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీ యుతో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాయదుర్గం ఐటీ కారిడార్ లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టీ హబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్ ఏర్పాటు చేశారు. ఉత్పత్తుల ఆవిష్కణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా టీ వర్క్స్ ను ప్రభుత్వం డిజైన్ చేసిందన్నారు కేటీఆర్.

దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువులను వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచన ఉన్న వారు టీ వర్క్స్ కు వస్తే వారి ఆలోచనలకు అనుగుణంగా వస్తువులను తయారు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. టీ వర్క్స్ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఉందన్నారు కేటీఆర్. ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్, మెటీరియల్స్ ఇతర అంశాలపై టీ వర్క్స్ లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తామని తెలిపారు.

టీ వ‌ర్క్స్ ప్రారంభోత్స‌వానికి వచ్చిన ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లీయుతో పాటు ఆయ‌న బృందానికి మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఈ ఎనిమిదిన్న‌రేళ్లలో తెలంగాణ ఎన్నో విజ‌యాలు సాధించిందన్నారు. ఇప్ప‌టికే ఎన్నో పెట్టుబ‌డులు తెలంగాణ‌కు త‌ర‌లిరాగా, తాజాగా ఫాక్స్ కాన్ పెట్టుబ‌డులు పెట్ట‌డం, ల‌క్ష మందికి ఉద్యోగ క‌ల్ప‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించినందుకు యంగ్ లీయుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్లు తెలిపారు.

Also Read.. Foxconn Investment in Telangana : తెలంగాణలో ఫాక్స్ కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు .. లక్షమందికి ఉద్యోగాలు

ఫాక్స్ కాన్‌తో తెలంగాణ ప్ర‌భుత్వ సంబంధాలు ముందు ముందు మరింత బ‌లోపేతం కావాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. అతి చిన్న దేశ‌మైన తైవాన్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో హైదరాబాద్‌ను షెన్ జెన్ చేద్దామన్న కేటీఆర్.. ఆ విశ్వాసం త‌న‌కు ఉంద‌న్నారు.(Minister KTR)

Also Read..Hyderabad: టీ వర్క్స్ సెంటర్ ప్రారంభోత్సవం

తెలంగాణ ప్రభుత్వానికి ఫాక్స్ కాన్ రూపంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. గురువారం సీఎం కేసీఆర్ తో ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం సమావేశమై ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమావేశంలో ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్, తైవాన్ వ్యాపార దిగ్గజం యంగ్ లీ యు స్వయంగా పాల్గొనడం విశేషం.

మరోవైపు తెలంగాణలో అభివృద్ధిని, హైదరాబాద్ నగరాన్ని చూసి తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లీ లీయు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం చూపించిన వీడియో తనను
ఎంతగానో ఆకట్టుకుందన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణలో జరిగిన అభివృద్ధి చాలా అద్భుతం అన్నారు యంగ్ లీయు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ రెవెన్యూ డబుల్ అవుతుందన్నారు. తెలంగాణ మంచి స్పిరిట్ ఉన్న రాష్ట్రం అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. టి-వర్క్స్ లోనే కాదు మిగతా రంగాల్లో కూడా డెవలప్ మెంట్ ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ స్పీడ్ నాకు బాగా నచ్చిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది తెలంగాణ అని ప్రశంసించారు.(Minister KTR)