TRS : అక్టోబర్ 25న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 12,769 గ్రామ పంచాయతీలకు కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

10TV Telugu News

Election of TRS state president : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 12,769 గ్రామ పంచాయతీలకు కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అనుబంధ సంఘాల నిర్మాణం పూర్తి అయిందని పేర్కొన్నారు. బుధవారం(అక్టోబర్ 13, 2021)న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ పార్టీ బైలా ప్రకారం రాష్ట్ర అధ్యక్షడి ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో… ఇక పార్టీ కార్యక్రమాలు చేపదుతున్నామని చెప్పారు. వచ్చే నెల రోజుల్లో రాష్ట్రంలో 100 శాతం వాక్సినేషన్ పూర్తి అవుతుందని తెలిపారు.

అక్టోబర్ 25వ తేదీన టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం ప్లీనరీ ఉంటుందని…అదే రోజు అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ప్లీనరీకి 13 వేలకు పైగా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. 25న హెచ్ ఐసీసీలో సమావేశం ఉంటుందని తెలిపారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు ప్రో. శ్రీనివాస్ రెడ్డి ఇంచార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 17న షెడ్యూల్ విడుదల, నామినేషన్ల స్వీకరిస్తారని తెలిపారు. అక్టోబర్ 22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిరస్తారని చెప్పారు.

Bathukamma : సద్దుల బతుకమ్మకు అంతా రెడీ.. ఈ ఏడాది రెండు రోజులు ఎందుకంటే..?

అక్టోబర్ 23న నామ్మినషన్ల పరిశీలన, 24వ తేదీ ఉప సంహరణ గడువు ఉంటుందని వెల్లడించారు. 25వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని..అదే రోజు పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు. వివిధ అంశాలపై విస్తృత చర్చ ఉంటుందని తెలిపారు. ప్లీనరి తీర్మానాల కమిటీ చైర్మన్ గా మధుసూధనా చారి వ్యవహరిస్తారని చెప్పారు. 17న తెలంగాణ భవన్ లో శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యల సమావేశం ఉంటుందని తెలిపారు.

నవంబర్ 15న తెలంగాణ విజయ గర్జన పేరుతో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 27న అన్ని నియోజక వర్గాల్లో విజయగర్జన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 15 తరువాత అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభత్సవాలు జరుగుతాయని అన్నారు. అనంతరం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తరువాత జిల్లా, రాష్ట్ర కమిటీల నియమకాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ వివరించారు.