KTR : అందుకే అంటున్న ప్రియమైన ప్రధాని.. మోదీ కాదు: కేటీఆర్ సెటైర్లు
ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఓ వింత కవిత రాశారు..

- Modi-KTR
KTR on PM Modi : పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వినూత్నంగా విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీని ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన మోదీ అనాలి అంటూ ఎద్దేవా చేశారు. సాధారణంగా కేటీఆర్ వినూత్నంగా సెటర్లు వేస్తుంటారు. దీంట్లో భాగంగా ప్రధాని మోదీపై ఓ వింత కవిత రాశారు ట్విట్టర్ లో ధరల పెరుగులదలపై వచ్చిన వార్తలకు సంబంధించి పేపర్ కటింగ్ ను పోస్ట్ చేస్తూ..
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్‌పై వేసిన దోశ పిరం..అన్నీ పిరం.. పిరం…
జనమంతా గరం… గరం…
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని… మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ..”
అంటూ రాసుకొచ్చారు.
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరంఅన్నీ పిరం.. పిరం…
జనమంతా గరం… గరం…అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని… మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ..”
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and… pic.twitter.com/BAzDtlDHPf
— KTR (@KTRBRS) April 5, 2023
కాగా పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అంశంలో బండి సంజయ్ ప్రమేయం ఉందని అంటూ అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై కూడా కేటీఆర్ సెటైర్లు వేశారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అందరికి ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ బండి సంజయ్ పై సెటైర్లు చేసారు మంత్రి కేటీఆర్. ఇలా బీజేపీ స్వార్ధ రాజకీయాలకు ప్రజలు బలి అవుతున్నారంటూ విమర్శలు సంధించారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023
KTR: పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : కేటీఆర్