Yadadri Temple : యాదాద్రి ఓ అద్భుతం.. వీడియో షేర్ చేసిన కేటీఆర్

తెలంగాణలోని ప్రవిత్ర పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి.. లక్ష్మినరసింహస్వామి కొలువై ఉన్న ఈ క్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.

Yadadri Temple : తెలంగాణలోని ప్రవిత్ర పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి.. లక్ష్మినరసింహస్వామి కొలువై ఉన్న ఈ క్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఆలయంలో రాతి స్తంభాలపై వైష్ణవ సంప్రదాయం ఉట్టిపడేలా చిత్రాలు వేశారు. ఆలయ నలువైపులా గోపురాలు నిర్మించారు. సుమారు రూ.500 కోట్లతో చేపట్టిన ఈ మహత్తర నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే దేవాలయ ఆవిష్కరణకు సంబంధించి అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.. త్వరలో దేవాలయ ఆవిష్కరణ చేయనున్నట్లు తెలిపారు.

Read More :  యాదాద్రిలో లక్ష పుష్పార్చన, భక్తిభావం ఉట్టిపడేలా స్వాగత తోరణం

వైష్ణవ సంప్రదాయానికి కేంద్రంగా భారతీయులందరికీ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్‌ దార్శనికతకు అభినందనలు తెలిపారు కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో యాదాద్రి ఆలయానికి సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేశారు. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు.. ఒద్దికగా పొదిగిన అందమైన కృష్ణరాతి శిలలు..గర్భగుడి ముఖద్వారం, ధ్వజ స్తంభానికి బంగారు తొడుగులు.. ఇలా ప్రతి అంగుళం భక్తులు తన్మయత్వం చెందేలా ఉన్నాయి. దేవాలయ నిర్మాణ శైలి, శిల్పకల భక్తులను కట్టిపడేస్తుంది. మంత్రి కేటీఆర్ షేర్ చేసిన వీడియోలో డ్రోన్ వ్యూతో పాటు దేవాలయం లోపల నిర్మాణాలు చక్కగా కనిపిస్తున్నాయి.

Read More :  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 15,47,185 ఆదాయం

 

ట్రెండింగ్ వార్తలు