KTR: నా వెంట్రుకలు, రక్తం ఇస్తా.. రాహుల్ గాంధీ ఇస్తారా? కేటీఆర్ సవాల్!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

10TV Telugu News

KTR: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న‌పై వ‌చ్చిన డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చిన కేటీఆర్.. తాను డ్ర‌గ్స్ అనాల‌సిస్ టెస్టుల‌కు సిద్ధమని, రాహుల్ గాంధీ సిద్ధ‌మా? అంటూ స‌వాల్ విసిరారు. తనను డ్ర‌గ్స్‌కు అంబాసిడ‌ర్ అని అంటారా? డ్ర‌గ్స్‌కు నాకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు కేటీఆర్.

ఎవ‌డో పిచ్చోడు ఈడీ ( ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ) కి లెట‌ర్ ఇచ్చాడ‌ని, నా రక్తం- వెంట్రుకలు ఇస్తా ఏ పరిక్షకైనా సిద్ధం- మరి రాహుల్ గాంధీ ఇస్తాడా అని ప్రశ్నించారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇండ్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు కేటీఆర్. అందరికి భాగోతం మా దగ్గర ఉందని, అన్ని బయట పెడుతామన్నారు. పీసీసీ పదవినే కొనుక్కున్నోడు.. రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా? అని ప్రశ్నించారు కేటీఆర్.

ఇష్టం వచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడుతామని చెప్పిన కేటీఆర్.. అవసరమైతే రాజద్రోహం కేసు పెట్టేందుకు వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పార్టీల‌కు సిల్లి పాలిటిక్స్ మాత్ర‌మే తెలుసునని, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలియద‌న్నారు. తెలంగాణ‌లో కొత్త‌గా పుట్టుకొచ్చిన పార్టీలు.. జాతీయ పార్టీల‌కు కొమ్ము కాస్తున్నాయ‌ని, టీఆర్ఎస్ పార్టీ ఓట్ల‌ను చీల్చ‌డమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు.