ఐటీలో మేటి: కొంపల్లిలో ఐటీ టవర్ – కేటీఆర్

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 01:49 PM IST
ఐటీలో మేటి: కొంపల్లిలో ఐటీ టవర్ – కేటీఆర్

Minister KTR Speech At HYSEA 28th Annual Summit : క‌రోనా సంక్షో‌భంలోనూ తెలంగాణ‌ రాష్ట్రంలో ఐటి రంగం ఆశాకిర‌ణంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్… ఎన్నో సాంకేతిక ఆవిష్కర‌ణ‌ల‌ను తీసుకువచ్చిందని చెప్పారు. దేశ స‌గ‌టు కంటే డ‌బుల్ గ్రోత్ రేట్ ను సాధించామన్నారు. త్వర‌లోనే కొంప‌ల్లిలో ఐటీ ట‌వ‌ర్ ను ప్రారంబిస్తున్నట్లు ప్రక‌టించారు. దేశంలోనే తెలంగాణ ఐటీ రంగం గ్రోత్ రేట్ లో అగ్రస్థానంలో నిలిచింద‌ని అన్నారు మంత్రి కేటీఆర్.



రెండింతల గ్రోత్ రేట్ :-
క‌రోనా స‌మ‌యంలోనూ .. జాతీయ స‌గ‌టుకు రెండింతల‌ గ్రోత్ రేట్ సాధించి.. తెలంగాణ‌కు ఆశాకిర‌ణంగా నిలిచింద‌న్నారు. తెలంగాణలో ఐటీ విస్తర‌ణకు ప్రభుత్వం ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకెళ్తుంద‌న్న మంత్రి.. త్వర‌లోనే కోంప‌ల్లిలో ఐటీ ట‌వ‌ర్ ప్రారంబించ‌బోతున్నామ‌ని ప్రక‌టించారు. హైద‌రాబ‌ద్ లో ఐటీ విస్తర‌ణ‌కోస‌మే ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాల‌సీని తీసుకువ‌చ్చిందని చెప్పారు.



కంపెనీలకు అవార్డులు :-
హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ 28వ వార్షిక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. ఐటీలో గ్రోత్‌ సాధించిన కంపెనీలకు అవార్డులు అందించారు.
https://10tv.in/ktr-review-on-rains-floods-in-hyderabad/
కోవిడ్ స‌మ‌యంలో ఐటీ రంగం 100 కోట్లు ప్రభుత్వానికి డొనేట్ చేసింద‌ని.. ఐటీ స‌హాకారంతో.. ‌టెస్టింగ్ సెంటర్లు, వైద్య సామాగ్రి సమకూర్చుకున్నామని చెప్పారు. క‌రోనా అందరి జీవితాలను, పరిశ్రమలను తీవ్రంగా దెబ్బ తీసిందన్నారు కేటీఆర్.



ఉపాధి కోల్పోయి :-
ఉపాధి కోల్పోయి.. లక్షల మంది వలస కూలీలు ర‌హ‌దారుల‌పై న‌డుస్తూ సొంత ఊళ్లకు వెళ్ళడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఐటి కారిడార్‌లో కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన ఐటి సెక్రటరీ జయేష్ రంజన్, హైసీ ప్రతినిధులు., సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు మంత్రి కేటీఆర్ ఆవార్డులు అంద‌చేశారు.