కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే స్పందించరా – కేటీఆర్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 01:05 PM IST
కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే స్పందించరా – కేటీఆర్

Minister KTR Telangana Bhavan Press Meet : కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే కేంద్రం, ప్రధాన మంత్రి స్పందించరా అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వరద సాయంపై కేంద్రం స్పందించలేదని, తెలంగాణకు సాయం ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారాయన. కర్నాటక, గోవా అడిగిన నిధులు కేంద్రం ఇచ్చిందని, హైదరాబాద్ కు కష్టం వస్తే..కనీసం ప్రధాని స్పందించలేదన్నారు. ప్రధానికి బీజేపీ పాలిత ప్రాంతాలపై ఉన్న ప్రేమ తెలంగాణపై లేదని తెలిపారు. 2020, నవంబర్ 08వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.



గత పాలకుల వల్లే ఇబ్బందులు :-
గత పాలకులు చేసిన తప్పుల వల్లే..ఇబ్బందులు పడుతున్నామని, వరదలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశారని గుర్తు చేశారు. ప్రజల వెన్నంటే ప్రభుత్వం ఉంటూ సహాయ సహకారాలు చేసిందని, వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను చూస్తే బాధేసిందన్నారు. వర్షం పడుతున్నప్పుడే వరద సాయం ప్రకటించినట్లు, తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు ఇచ్చామన్నారు.



4.30 లక్షల కుటుంబాలకు సాయం :-
ఇప్పటి వరకు 4.30 లక్షల కుటుంబాలకు సాయం చేశామని స్పష్టం చేశారు. విపత్తులు వచ్చిన సమయంలో ఏ ప్రభుత్వమైనా సాయం చేసిందా అన్నారు. వరదల సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసినా తాము పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఇక్కడ పార్టీలను చూసి సాయం చేయలేదని, బాధితులను చూసి సాయం చేశామన్నారు. చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సూచించారాయన.



కేంద్రం ఏమి ఇచ్చింది ? :-
ముఖ్యమంత్రి జీతం కేంద్రమే ఇస్తుందని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారని, ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం, ప్రజలు కేంద్రానికి ఇచ్చింది. 2 లక్షల 72 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కట్టిందని, గ్రాంట్ల రూపంలో లక్షా 40 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయ మంత్రా ? నిస్సహాయ మంత్రా ? అనేది తెలియదని ఎద్దేవా చేశారు.

కష్టమొస్తే ప్రధాని స్పందించరా ?  :-

రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే..ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని, చిల్లర, మల్లర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి ఒక పైసా తేలేని వారు విమర్శిస్తారా అంటూ నిలదీశారు. కర్నాటక, గుజరాత్ దేశంలో అంతర్భాగం, కష్టమొస్తే ప్రధాన మంత్రి స్పందించరా అన్నారు.



కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆక్రమణలు లేవా ? :-
దుబ్బాకలో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కదన్నారు. ఆరేళ్ల రాకముందు వీళ్లు అధికారంలో లేరా అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆక్రమణలు లేవా అన్నారు. వరదలు వచ్చినప్పుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విరాళాలు ఇచ్చారని, ఆ పార్టీకి సంబంధించిన వాళ్లు ఒక్క రూపాయైనా ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారాయన. హైదరాబాద్ ఏం అభివృద్ధి చేశారు ? 11 వేల టాయిలెట్ కట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.



ఎవరూ ఆందోళన చెందవద్దు :-
సహాయక చర్యలు చేపడుతూ..తాము ఉంటే..హీనమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం..మీ ప్రభుత్వం. రూ. 550 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. అర్హులు మిగిలిపోతే..వారికి సహాయం చేస్తామని, రూ. 100 కోట్లు ఇచ్చి పేదలను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. రెచ్చగొట్టి..వారిచేత ఆందోళనలు చేయిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అధికారులు వారి వద్దకే వచ్చి..సహాయం చేస్తారని తెలిపారు. ఎవరికి నష్ట పరిహారం అందిందో తమ వద్ద వివరాలు ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్.