Karimnagar : కరీంనగర్ గులాబీ మయం..మంత్రి కేటీఆర్ రాక

మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు...

Karimnagar : కరీంనగర్ గులాబీ మయం..మంత్రి కేటీఆర్ రాక

Ktr Karimnagar

Minister KTR : కరీంనగర్ గులాబీ మయం అయిపోయింది. ఎక్కడ చూసినా మంత్రి కేటీఆర్ ఫొటోలు, ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ జెండాలు దర్శనమిస్తున్నాయి. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు 2022, మార్చి 17వ తేదీ గురువారం మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంత్రి గంగుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు వేల బైక్ లతో భారీ ర్యాలీగా మానేరు బ్రిడ్జీ దాక వెళ్లనున్నారు. ప్రధాన చౌరస్తాలన్నింటిలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Read More : Holi : మందుబాబులకు షాక్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు క్లోజ్

మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. రాంనగర్ లోని మార్క్ ఫెడ్ మైదానం దాక బైక్ ర్యాలీగా వెళ్లనున్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ .615 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. సభ అనంతరం చొప్పదండి మున్సిపాల్టీకి చేరుకుని రూ. 38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. సాయంత్రం జిల్లాలోని ఉజ్వల పార్కు సమీపంలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ప్రారంభిస్తారు.

Read More : Telangana Covid Numbers : తెలంగాణలో కొత్తగా 75 కరోనా కేసులు

కరీంనగర్ గులాబీ మయం..మంత్రి కేటీఆర్ రాకఅక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. మున్సిపాల్టీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీయనున్నారు. అనంతరం హైదరాబాద్ కు పయనం కానున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి తెలిపారు. మార్క్ ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, ప్రజల కోసం వేసిన టెంట్లు, ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండ ఉండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

–  ఉదయం 10:30 గంటలకు శ్రీ చైతణ్య ఇంజనీరింగ్ కళాశాల తిమ్మాపూర్ నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఘన స్వాగతం.
ఉదయం 11:00 గంటలకు నగరంలోని మానేరు వంతెన పై నగరపాలక సంస్థకు చెందిన మిషన్ భగీరథ వాటర్ పైలాన్ ప్రారంభోత్సవం, 24/7 మంచి నీటి సరఫరా మరియు మానేరు రీవర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు శంఖుస్థాపన.
ఉదయం 11:30 గంటలకు నగరంలోని రాంనగర్, పద్మానగర్ ఏరియాలో గల మార్క్ ఫేడ్ గ్రౌండ్ లో  నగరపాలక సంస్థ మరియు స్మార్ట్ సిటీ వివిద అభివృద్ది పనులకు శంఖుస్థాపన. అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాల పై సభలో ప్రసంగం.
మద్యాహ్నం 1:00 గంటలకు చొప్పదండికి బయలుదేరి… చొప్పదండిలో అభివృద్ది కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 4:00 గంటలకు తిరిగి కరీంనగర్ నగరానికి చేరుకుంటారు.
సాయత్రం 4:00 గంటలకు ఉజ్వల పార్కు వద్ద ఉన్న ఐటీ టవర్ లో జిల్లా మున్సిపల్ అధికారులు మరియు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.