Minister KTR : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేస్తే అరెస్టు.. కానీ మేము సహిస్తున్నాం : మంత్రి కేటీఆర్

బీజేపీ పాలిత రాష్ట్రాల తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని అన్నారు.

Minister KTR : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేస్తే అరెస్టు.. కానీ మేము సహిస్తున్నాం : మంత్రి కేటీఆర్

Minister KTR (2)

Minister KTR : బీజేపీ పాలిత రాష్ట్రాల తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని అన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పరుష పదాలతో ట్వీట్ చేసినందుకు బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్ ను అరెస్టు చేసిన విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ లో ప్రస్తావించారు.

తెలంగాణలోనూ అదే తరహాలో సమాధానం ఇవ్వాలేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు అంటూ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ దూషించే స్వేచ్ఛ కాకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై మరోసారి మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కర్ణాటకలో జరిగిన ఒక ఉదంతాన్ని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

KTR : కేసీఆర్‌ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం- బీజేపీపై కేటీఆర్ ఫైర్

బెంగళూరులో ఒక కన్నడ నటుడు చేతన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో నటుడు చేతన్ పై కేసు మోదు చేయడమే కాకుండా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీనిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసినా, మాట్లాడినా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులపై పరుష పదజాలంతో మాట్లాడటమే కాకుండా అవమానకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము సహిస్తున్నామని చెప్పారు.