Minister KTR : బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్..నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు
ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ, హైదరాబాద్ సీపీని కోరారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొదని సూచించారు.

Ktr
Minister KTR : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాలికపై జరిగిన దారుణానికి సంబంధించిన వార్త చూసి దిగ్ర్భాంతికి గురయ్యాయని, ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ, హైదరాబాద్ సీపీని కోరారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొదని సూచించారు. జూబ్లీహిల్స్ లో కొందరు యువకులు బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
పబ్‌లో పార్టీకి వెళ్లిన తనపై కొందరు యువకులు అత్యాచారం చేశారంటూ బాలిక స్టేట్మెంట్ ఇచ్చింది. మే 28న సాయంత్రం 5 గంటలను తనను.. బలవంతంగా కారులో తీసుకెళ్లారని బాధితురాలు అంటోంది. పబ్‌కు వెళ్లిన తనను కారులో బలవంతంగా తీసుకెళ్లారంటోంది బాలిక. బెంజ్ కారులో తనపై అత్యాచారం చేశారంటూ బాలిక ఫిర్యాదు చేసింది. అత్యాచారం తర్వాత తనను పబ్ వద్ద వదిలిపెట్టి.. యువకులు వెళ్లిపోయారని చెబుతోంది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తండ్రికి చెప్పానని.. మెడ దగ్గర తీవ్రగాయాలయ్యాయని బాధితురాలు వాపోతోంది.
Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు..రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం
ఫ్రెండ్స్ పిలిచారంటూ.. బాలిక జూబ్లీహిల్స్‌లోని అమ్నేసియా పబ్‌కు వెళ్లింది. సూరజ్, హదీ అక్కడ బాలికను రిసీవ్ చేసుకున్నారు. అక్కడ మరికొంతమంది యువకులు పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ అయ్యాక.. బాలికపై కన్నేసిన యువకులు.. బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సుమారు రెండు గంటల పాటు.. కారులోనే బాలికను చిత్రహింసలకు గురిచేశారు. బాలికను కొడుతూ.. లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ తీసుకొచ్చి.. పబ్ దగ్గరే వదిలిపెట్టారు. ఇంటికి వెళ్లినా.. ఈ విషయాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు.
బాలిక ముభావంగా ఉండటం.. మెడమీద గాయాలు ఉండటంతో.. ఆమె పేరెంట్స్ ఏమైందంటూ ఆరా తీశారు. బాలిక విషయం చెప్పడంతో.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మే 28న నా కుమార్తె జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని అమ్నేసియా అండ్ ఇన్సోమియా పబ్‌లో పార్టీకి వెళ్లింది. మా అమ్మాయిని ఆమె ఫ్రెండ్స్ సూరజ్, హదీ తీసుకెళ్లారు.
సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పబ్ నుంచి బయటకు వచ్చిన నా కూతురును.. కొందరు యువకులు TS09FL6460 నెంబర్ ఉన్న రెడ్ కలర్ మెర్సిడైజ్, T/R నెంబర్‌తో ఉన్న ఇన్నోవా కారులో బలవంతంగా ఎత్తుకెళ్లారు. నా కూతురుతో వారు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె శరీరంపై గాయాలు కూడా చేశారు. అప్పటి నుంచి నా కూతురు తీవ్ర షాక్‌లో ఉంది. జరిగిన విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయింది. ఈ కేసులో విచారణ జరిపి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తండ్రి కోరుతున్నారు.