Minister KTR Tweet: ‘విశ్వగురువును పొగడండి’.. పడిపోయిన రూపాయి విలువ.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు..

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (రూ.81.18) పడిపోవడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రానికి వ్యతిరేఖంగా ట్వీట్ చేశారు.

Minister KTR Tweet: ‘విశ్వగురువును పొగడండి’.. పడిపోయిన రూపాయి విలువ.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు..

Minister Ktr

Minister KTR Tweet: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (రూ.81.18)  పడిపోవడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రానికి వ్యతిరేఖంగా ట్వీట్ చేశారు. రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోయిందని, అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కోసం వెతుకుతున్నారంటూ విమర్శించారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని అన్నారు.

National Herald Case : తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు .. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశాలు

నిరుద్యోగం, ద్రవ్వోల్బణం ఇలా అన్ని ఆర్థిక అవరోధాలకు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కారణమని చెప్పారు. విశ్వగురువును పొగడండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య కొద్దికాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనికితోడు ట్వీటర్ వేదికగానూ కేంద్రంపై తెరాస నేతలు విరుచుకుపడుతున్నారు. తాజా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు పలురకాల కామెంట్ల చేస్తున్నారు.

ఇదిలాఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణకు ప్రథమ స్థానం రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని అన్నారు.