Minister Ktr: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఆరుగురు మంత్రులు అక్కడే..

ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ తాగునీటి సరఫరా...

Minister Ktr: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఆరుగురు మంత్రులు అక్కడే..

Minister Ktr (2)

Minister Ktr: ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్‌ వెల్‌కు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అయితే ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు పాల్గోనున్నారు. వీరిలో స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి పాల్గోనున్నారు.

Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

కేటీఆర్ పర్యటన ఇలా..
– శనివారం ఉదయం 8.50 కి బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు
– 9గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 9.40 గంటలకు పెద్దపూర మండలం సుంకిశాల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ  హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇన్ టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత కోదండాపూర్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు.
– 10.15 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.45 గంటలకు నందికొండకు చేరుకుంటారు.
– 11.30 గంటలకు బుద్ధవనం ప్రారంభిస్తారు. అనంతరం పరిశీలిస్తారు
– 11.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హాలియో మున్సిపాలిటీకి చేరుకుంటారు.
– మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించి నందికొండ, హాలియా మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
– మధ్యాహ్నం 12.30 గంటలకు హాలియా మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు.
– 1.30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత 2.30 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో బయలుదేరి హైదరాబాద్ కు తిరుగుపయనం అవుతారు.