KTR Inaugurate Chandrayanagutta New Flyover : నేడు చాంద్రాయణగుట్ట కొత్త ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త ఫ్లైఓవర్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 45 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను విస్తరించారు. మొత్తం 4 లైన్లతో డెవలప్‌ అయిన ఈ ఫ్లైఓవర్‌.. 674 మీటర్ల పొడవుతో నిర్మించారు.

KTR Inaugurate Chandrayanagutta New Flyover : నేడు చాంద్రాయణగుట్ట కొత్త ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

KTR Inaugurate Chandrayanagutta New Flyover

KTR Inaugurate Chandrayanagutta New Flyover : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త ఫ్లైఓవర్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 45 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను విస్తరించారు. మొత్తం 4 లైన్లతో డెవలప్‌ అయిన ఈ ఫ్లైఓవర్‌.. 674 మీటర్ల పొడవుతో నిర్మించారు. కందికల్‌ గేట్‌, బర్కాస్‌ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్‌ నుంచి ప్రయాణించొచ్చు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎల్బీనగర్‌ మీదుగా నల్గొండ, వరంగల్‌ వెళ్ళే వారికి ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.

ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్‌కు అప్రోచ్‌ చివరిలో ట్రాఫిక్‌ రద్దీ పెరగడంతో.. ఈ ఫ్లైఓవర్‌ను పొడిగించారు. కుడి వైపున దర్గా, DLRL… ఎడమ వైపున మసీద్, మందిర్ ఉండడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. కొత్తగా విస్తరించిన ఫ్లైఓవర్‌… ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ఉపయోగపడనుంది. ఈ ఫ్లై ఓవర్‌ను రెండు వైపులా నిర్మించడంతో ఓవైసీ జంక్షన్‌ మీదుగా ఎల్బీనగర్‌ వరకు, అలాగే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ వైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు వీలవుతుంది.

Mithani Flyover : మిధాని ఫ్లై ఓవర్‌కు మాజీ రాష్ట్రపతి పేరు

SRDP ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజల మౌలిక అవసరాలు తీరడంతో బల్డియా లక్ష్యం నేరవేరే అవకాశం దగ్గర్లోనే ఉంది. SRDP ద్వారా హైదరాబాద్‌ మహానగరంలో జీహెచ్‌ఎంసీ మొత్తం 41 పనులను చేపట్టింది. ఇందులో 30 పూర్తికాగా.. 11 ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నాయి. అతి త్వరలోనే మరిన్ని ఫ్లైఓవర్‌లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. నాగోల్‌ వద్ద రెండు వైపులా చేపడుతోన్న అండర్‌పాస్‌ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రైల్‌ ఓవర్‌ బ్రిడ్జిలు చేపట్టడంతో హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తీరాయని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.