Minister KTR: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆయన కోరారు. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని అన్నారు.

Minister KTR: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ

Minister KTR: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆయన కోరారు. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని అన్నారు.

ఎనిమిదేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని, పారిశ్రామిక పురోగతికి కేంద్ర సర్కారు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడం దేశానికి సహకరించినట్లేనని తెలిపారు. దేశ పారిశ్రామిక రంగంలో రాష్ట్రానిది కీలక పాత్ర అని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యం ఉందని అన్నారు.

జహీరాబాద్ నిమ్జ్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. అలాగే, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ కు నిధులు కేటాయించాలని కేటీఆర్ లేఖలో కోరారు. హైదరాబాద్-నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని అన్నారు. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చెప్పారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ ను పునరుద్ధరించాలని, హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుచేయాలని సీతారామన్ ను కేటీఆర్ లేఖలో కోరారు.

Minister KTR: పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ టూర్‌