KTR..Moinabad Farmhouse Row : అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు .. పుణ్యక్షేత్రాన్ని సంప్రోక్షణ చేయాలి : కేటీఆర్

అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు .. భక్తుల మనోభావాలని దెబ్బతీశారు..యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి అంటూ బండిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.

KTR..Moinabad Farmhouse Row : అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు .. పుణ్యక్షేత్రాన్ని సంప్రోక్షణ చేయాలి : కేటీఆర్

Minister KTR's sensational comments on the oath made by Bandi Sanjay

KTR on Moinabad Farmhouse Row: మొయినాబాద్ ఫామ్ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ శుక్రవారం (అక్టోబర్ 28,2022) యాదాద్రి దేవాలయంలో ప్రమాణం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే .. యాదాద్రిలో ప్రమాణం చేసి భక్తుల మనోభావాలను బండి దెబ్బదీశారని..యాదాద్రిని సంప్రోక్షణ చేయాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ప్రమాణాలు చేసుకుంటూ పోతే చట్టాలు, కోర్టుల అవసరం ఏమంది అని అన్నారు.రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో ఫాంహౌస్ వేదికగా చోటుచేసుకున్న ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం’పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చెప్పులు మోసి చేతులతోనే అత్యంత పవిత్రమైన లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ప్రమాణం చేసి బండి సంజయ్ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ విమర్శించారు. బండి ప్రమాణంతో అపవిత్రమైన యాదాద్రిని సంప్రోక్షణ చేయాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

రేపిస్టులను జైలునుంచి విడుదల చేసే బీజేపీ చట్టాలని గౌరవించే టీఆర్ఎస్ పై విమర్శలు చేయటమా? అంటూ ఎద్దేవా చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో దొంగలెవరో..దొరలు ఎవరో త్వరలోనే తేలుతుందని..ఇప్పటికే పోలీసులు బయటపెట్టిన ఆడియోల్లో వెల్లడి అయ్యిందని అన్నారు.  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి. ఇప్పుడు మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారని… పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. మేం బాధ్యత గల వ్యక్తులం. చట్టం కచ్చితంగా తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు కేటీఆర్.

దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మేం మాట్లాడం..తొందర పడవద్దని మా పార్టీ నాయకత్వానికి సూచించానని తెలిపారు. సమయానుసారం సీఎం కేసీఆర్ అన్ని విషయాలు మాట్లాడతారని..ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంక పోలీసులు ఎందుకు? అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.