Minister KTR: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. గులాబిమయమైన ఓరుగల్లు..

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హన్మకొండలో రూ. 232 కోట్ల వ్యయంతో...

Minister KTR: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. గులాబిమయమైన ఓరుగల్లు..

Ktr

Minister KTR: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హన్మకొండలో రూ. 232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మేఘా గ్యాస్ కంపెనీ నర్సంపేటలో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయనుంది. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా నర్సంపేటలో తొలుత ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని గ్యాస్ సరఫరాను ప్రారంభిస్తారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. ఉదయం 9.15 గంటలకు వరంగల్ జిల్లాలో ప్రారంభం కానున్న మంత్రి కేటీఆర్ పాదయాత్ర సాయంత్రం 4.30 గంటలకు బాలసముద్రంలోని హయగ్రీవాచారి (కుడా) గ్రౌండ్‌లో బహిరంగ సభతో ముగుస్తుంది. ఈ పర్యటనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ఉమ్మడి వరంగల్ తెరాస ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గోనున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా ఓరుగల్లు గులాబీమయంగా మారింది. తెరాస నేతల ప్లెక్సీలు, పార్టీ జెండాలతో కేటీఆర్ పర్యటించే ప్రాంతాలన్నీ గులాబీమయంగా మారాయి.

Minister KTR: తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేంవర్క్ – 2022 ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కేటీఆర్ పర్యటన సాగుతుందిలా..
బుధవారం ఉదయం 9.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చేరుకుంటారు. 9.30 గంటలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 10.20 గంటలకు స్మార్ట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రీజనల్ లైబ్రరీ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొంటారు. 10.50 గంటలకు పబ్లిక్ గార్డెన్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా నర్సంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12.10 గంటలకు నర్సంపేట మున్సిపల్ కార్యాలయం నుంచే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Telangana : కేసీఆర్ తప్ప..ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా? : KTR

12.30 గంటలకు అశోక్ నగర్ లో పీఎన్జీ పైప్ లైన్ ప్రారంభోత్సవం, 12.40 గంటలకు ఎంఏఆర్ ఫంక్షన్ హాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 1.30 గంటలకు సభాస్థలి నుంచి హెలికాప్టర్ లో 2గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హనుమకొండకు చేరుకుంటారు. ఎమ్మెల్యే ఆరూరి ఇంట్లో మధ్యాహ్న భోజన అనంతరం హనుమకొండ కలెక్టరేట్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు బాల సముద్రంలోని హయగ్రీవాచారి (కుడా) గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ససాయంత్రం 6గంటలకు రోడ్డుమార్గాన తిరిగి హైదరాబాద్ వెళ్తారు.