Minister Puvvada Ajay: మూడోసారి అందరినీ ఫుట్‌బాల్ ఆడటానికి నేను గట్టిగా ఉన్న.. ప్రజల ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొనలేవు..

ఆ సెంబ్లీ గేట్లు తాకనివ్వం అని అంటున్నారు. అంత అహంకారం పనికిరాదు. ఖమ్మం ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేవు జాగ్రత్త అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Puvvada Ajay: మూడోసారి అందరినీ ఫుట్‌బాల్ ఆడటానికి నేను గట్టిగా ఉన్న.. ప్రజల ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొనలేవు..

Minister Puvvada Ajay

Minister Puvvada Ajay: అసెంబ్లీ గేట్లు తాకనివ్వం అని కొందరు అంటున్నారు.. అంత అహంకారం పనికిరాదు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం చిమ్మపుడి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. డబ్బులు ఇచ్చి జనాలను కదిలించటం కాదు ఆత్మీయ సమ్మేళనం అంటే.. ఆ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతుంటే జనాలు లేకుండా పోయారు.. అది ఆ నాయకుడికి ఉన్న ఆదరణ అంటూ పరోక్షంగా పొంగులేటిపై విమర్శలు చేశారు. మంత్రి పదవి వచ్చిన తరువాత జిల్లాలోని మారుమూల ప్రాంతాలను అభివృద్ధిచేశాం. ఖమ్మం నియోజకవర్గంను ఈ తొమ్మిదేళ్లలో అన్నివిధాల అభివృద్ధి చేశాం.. ఇప్పుడు రాజకీయం చేయాలంటూ కార్యకర్తలకు పువ్వాడ పిలుపునిచ్చారు.

Ajay Kumar Puvvada : ఆయన వల్లే.. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది- మంత్రి పువ్వాడ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటుంది.. రాష్ట్రంలో మళ్లీ కరెంట్, నీటి కష్టాలను తీసుకురావడానికా అని పువ్వాడ ప్రశ్నించారు. సబ్బండ వర్గాలకు న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. రఘునాథపాలెం మండలంలోనే రూ. 250కోట్ల అభివృద్ధి చేశామని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పక్క రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

Ponguleti Srinivas Reddy : మాయల మరాఠిని నమ్మి మరోసారి మోసపోవద్దు- పొంగులేటి

ఆసెంబ్లీ గేట్లు తాకనివ్వం అని అంటున్నారు. అంత అహంకారం పనికిరాదు. ఖమ్మం ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేవు జాగ్రత్త అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతోనే ప్రజల అభిమానం కొనొచ్చు అంటే అంబానీ, అదానీలే నాయకులు అవుతారు.. గుర్తు పెట్టుకో అంటూ సూచించారు. జిల్లా‌లో అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. మేము అరాచకమే చేస్తే మీరు ఇన్ని మాటలు మాట్లాడేవారా? అని పువ్వాడ ప్రశ్నించారు. పిట్టల దొరల బెదిరింపులకు మేం భయపడం. మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆర్. సిద్ధాంతం, జెండా పార్టీ లేని వారుకూడా సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు.

Puvvada Ajay Kumar: ఎవరెవరో వచ్చి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు.. షర్మిల కడప రౌడీయిజం ఇక్కడ చూపిస్తుంది

ఓటుకు నోటు కేసులో దొంగలుగా ఉన్నవారు కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు అంటూ పువ్వాడ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 60 సీట్లలో అభ్యర్థులు కూడా లేరు. బీజేపీకి జిల్లాలో డిపాజిట్లుకూడా రావు. మూడో వసారి అందరినీ ఫుట్‌బాల్ ఆడటానికి నేను గట్టిగా ఉన్న. ఖమ్మం అంటే నాకు నియోజకవర్గం కాదు నా సొంత కుటుంబం అని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.