Sabitha Indra Reddy : డిసెంబర్ 2 నుంచి తెలంగాణలో స్కూళ్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించనుందనే భయాల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి తెలంగాణలో స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని

10TV Telugu News

Sabitha Indra Reddy : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించనుందనే భయాల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి తెలంగాణలో స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చేసిందని ప్రచారం నడుస్తోంది. ఇది నిజమేనేమో అని చాలామంది నమ్మేశారు కూడా. కాగా, ఈ ప్రచారం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. వెంటనే రాష్ట్ర విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. డిసెంబర్ నుంచి విద్యాసంస్థలు బంద్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.

Paytm Transit Card : పేటీఎం ఆల్ ఇన్-వన్ కార్డు.. అన్ని ట్రాన్సాక్షన్లకు ఒకే కార్డు!

రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడపాల్సిందేనని విద్యాశాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తేల్చిచెప్పారు. స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సైతం స్కూళ్లు నడపాల్సిందేనని సీఎం చెప్పారని మంత్రి వెల్లడించారు.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల మృతికి గల కారణాలు వివరించిన కిమ్స్‌ ఎండీ డా.భాస్కర్ రావు

సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు. పిల్లల భద్రత, క్షేమం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిద్దామని, కరోనా వ్యాప్తిని కట్టడి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సబిత సూచించారు.

×