Satyavathi Rathod: గవర్నర్ తమిళిసై ఆంతర్యం ఏంటో అందరికి అర్ధం అవుతుంది: మంత్రి సత్యవతి రాథోడ్

మహిళలను అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి మాది అటువంటిది గవర్నర్ ను అవమానించాల్సిన అవసరం మాకు లేదని మంత్రి అన్నారు

Satyavathi Rathod: గవర్నర్ తమిళిసై ఆంతర్యం ఏంటో అందరికి అర్ధం అవుతుంది: మంత్రి సత్యవతి రాథోడ్

Minister Satyavathi

Satyavathi Rathod: తెలంగాణలో రాజకీయాలు వేడిమీదున్నాయి. గవర్నర్ తమిళిసై, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. “నేను తలుచుకుంటే తెలంగాణలో ప్రభుత్వం పడిపోయేది” అంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఈక్రమంలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు మహిళలంటే ఎంతో గౌరవమని..మహిళలను అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి మాది అటువంటిది గవర్నర్ ను అవమానించాల్సిన అవసరం మాకు లేదని మంత్రి అన్నారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై అక్కడ కలిసే వారిని కలువకుండా బీజేపీ నేతలను కలిసి అనంతరం మాపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Also read:R. Krishnaiah : గవర్నర్ గవర్నర్ గానే ఉండాలి.. రాజకీయ నాయకురాలుగా ఉండకూడదు: కృష్ణయ్య

తాను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్ అనడం కరెక్ట్ కాదని మంత్రి వ్యాఖ్యానించారు. 119 స్థానాలకు గానూ 100కు పైచిలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా కులుస్తుందని? మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గవర్నర్ ఢిల్లీకి వెళ్లి మాట్లాడిన మాటలను చూస్తుంటే గవర్నర్ మనస్సులో ఏం ఉందో అర్థం అవుతుందన్న సత్యవతి రాథోడ్..గవర్నర్ ఆంతర్యం ఏంటో తెలంగాణ ప్రజలకు అర్థం అయిందని అన్నారు. ప్రో రోగ్ కాలేదు కాబట్టి బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నమని, ఇందులో జరిగింది ఏమైనా ఉంటే ఇక్కడే చెప్పాల్సిందనీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Also read:Pawan Kalyan : విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం : పవన్ కళ్యాణ్

ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంను బెదిరించినట్టు గవర్నర్ మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి రాధోడ్..గవర్నర్ బీజేపీ కార్యకర్తగా మాట్లాడినట్టు భావిస్తున్నామని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ రాష్ట్రపతి కలువకుండా ప్రధానిని,హోమ్ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి కలిసి పిర్యాదు చేసిందని దీన్నిబట్టే ఆమె ఏంటో అర్థం అవుతుందని మంత్రి సత్యవతి అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిస్తే ఏం జరిగిందో గవర్నర్ తెలుసుకోవాలన్న మంత్రి సత్యవతి రాథోడ్ అప్పుడు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందంటూ ఘాటు విమర్శలు చేశారు.

Also read:Hyderabad : పుడింగ్‌ ఇన్‌ మింక్‌ పబ్‌ కేసులో సంచలన విషయాలు.. డ్రగ్స్‌ తీసుకున్న 20మంది వీఐపీలు