Srinivas Goud : కేసీఆర్‌ను టచ్ చేస్తే దేశమే భగ్గుమంటుంది, పేదల అకౌంట్‌లో రూ.15లక్షలు ఎక్కడ?

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను ఆయన తప్పుపట్టారు. కేంద్రం విధానాలు.. అన్నింటిని ప్రైవేట్ పరం చేసేందుకు..

Srinivas Goud : కేసీఆర్‌ను టచ్ చేస్తే దేశమే భగ్గుమంటుంది, పేదల అకౌంట్‌లో రూ.15లక్షలు ఎక్కడ?

Srinivas Goud

Srinivas Goud : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను ఆయన తప్పుపట్టారు. కేంద్రం విధానాలు.. అన్నింటిని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా ఉన్నాయన్నారు. కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయలతో లాభాల్లో ఉన్న సంస్థలను సైతం ప్రైవేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నష్టాల్లో ఉన్న వాటిని అమ్మడం ఎక్కడైనా సహజం… కానీ, కేంద్రం అన్నీ అమ్మకానికి పెడుతోందని మండిపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

EPFO గుడ్‌న్యూస్.. గడువు పెంపు.. ఉద్యోగులకు బెనిఫిట్

కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని మంత్రి వాపోయారు. వ్యవసాయంపై కేంద్రం నిర్ణయం శరాఘాతంగా మారనుందన్నారు. కనీసం కిసాన్ మోర్చా అభిప్రాయం అయినా బీజేపీ తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను భయపెట్టాలని బీజేపీ నేతలు చూడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ను జైల్లో పెడితే దేశమే భగ్గుమంటుందన్నారు. లేఖలు ప్రధానికి కాకుండా పార్టీకి రాయాలా? యూపీఏ ఛైర్మెన్ కు రాయాలా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

మా సహనాన్ని పరీక్షించొద్దని బీజేపీని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మావి గొంతెమ్మ కోర్కెలు కావన్న మంత్రి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగుతున్నామని తేల్చి చెప్పారు. రాష్ట్రంపై కక్ష కట్టినట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణతో ఏ రంగంలోనైనా పోటీ పడగలవా? అని నిలదీశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? పేదల అకౌంట్‌లో రూ.15 లక్షలు ఎక్కడ? అని మంత్రి అడిగారు.

Lose Weight : సన్నగా మారాలనుకునే వారు ఇలా చేసి చూడండి!

ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇబ్బందులు ఉండడం సహజం అన్న మంత్రి, వాటిని అధిగమించడం సమస్య కాదన్నారు. దేశవ్యాప్తంగా మద్య నిషేధం కేంద్రం అమలు చేస్తుందా? అని మంత్రి ప్రశ్నించారు. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తే మంచిదన్నారు.