Talasani Srinivas Yadav : హైదరాబాద్ సనత్ నగర్ బాలుడి హత్య బాధాకరం.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని

ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందని.. అందులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

Talasani Srinivas Yadav : హైదరాబాద్ సనత్ నగర్ బాలుడి హత్య బాధాకరం.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav : హైదరాబాద్ సనత్ నగర్ బాలుడి హత్య ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులతో తలసాని మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలుడి మృతి చాలా బాధాకరం అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందని.. అందులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. బస్తీవాసులు చెబుతున్న దానిని బట్టి చూస్తే అది నరబలి కాదని అర్థమవుతుందన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలున్నట్లు తెలుస్తుందని తెలిపారు.

Hyderabad : హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం.. బాలుడు అనుమానాస్పద మృతి, నరబలిగా అనుమానం!

ఎదైనా సమస్య ఉంటే ఇరు కుటుంబాలు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదని..కానీ, బాలుడిని హత్య చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అందరికీ రక్షణ ఉండే విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బస్తీలో భయానక వాతావరణం పోగొట్టేందుకు బస్తీవాసులతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు. స్థానికులు భయపడకూదన్నారు.

బాలుడి తండ్రి వసీంఖాన్ కు, ఇమ్రాన్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఇరువురి మధ్య చిన్న గొడవ ఉంది. ఈక్రమంలో బాలుడిని హిజ్రా ఇమ్రాన్ హత్య చేశాడు. ఇమ్రాన్ బాలుడిని చంపి మృతదేహాన్ని నాలాలో పడేశాడు. వసీంఖాన్ పై కక్షతో బాలుడిని ఇమ్రాన్ చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Boy Murdered : మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య.. చెట్టుకు ఉరేసి చంపిన దుండగులు..!

అబ్దుల్ ను నరబలి ఇచ్చారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. ఇమ్రాన్ ఇంటి ముందు క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.