లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తి – బాలకృష్ణ

Updated On - 11:41 am, Mon, 18 January 21

MLA Balakrishna paid tributes to NTR : ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్‌ 25వ వర్థంతి సందర్భంగా సోమవారం (జనవరి 18, 2021)న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో సోదరులతో కలిసి తన తండ్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జాతి గర్వించదగ్గ నాయకుడన్నారు. ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తి అన్నారు.

తెలుగువారి గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని నాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు ఆయన సతీమణి, ఏపీ తెలుగు అకాడమి చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆమె నివాళులర్పించారు. భావి తరాలను ఎన్టీఆర్‌ స్ఫూర్తి ప్రధాత అన్న ఆమె.. ఎన్టీఆర్‌ హయాంలో చూసి రామరాజ్యాన్ని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలనలో చూస్తున్నామన్నారు.