Eatala Rajender: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది: బీజేపీ ఎమ్మెల్యే ఈటల కామెంట్స్

తాను పొంగులేటి, జూపల్లితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, ఆ సమయంలో వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల వాపోయారు.

Eatala Rajender – BJP: బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) బీజేపీలో చేరటం కష్టమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. ఈటల ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉందని, బీజేపీ లేదని చెప్పారు.

బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లిని ఇప్పటికే పలుసార్లు ఈటల కోరిన విషయం తెలిసిందే. తాను పొంగులేటి, జూపల్లితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, ఆ సమయంలో వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల వాపోయారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా మాత్రమే ఆపగలిగానని ఇంకా చేసేదేముందని అన్నారు.

తమ పార్టీలో చేరటానికి వారిద్దరికీ కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. ఖమ్మం ఇప్పటికీ సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న జిల్లా అని ఆయన చెప్పారు. అయితే, దేశానికే కమ్యూనిస్ట్ సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ అని అన్నారు. ఖమ్మంలో కమ్యూనిస్టులు, టీడీపీ సహా అన్ని పార్టీలుంటాయని చెప్పారు. ప్రియాంక గాంధీ కలుస్తున్నారనే సమాచారంతోనే అప్పట్లో ఖమ్మం పొంగులేటి ఇంటికి వెళ్లామని అన్నారు.

Telangana Formation Day 2023: జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ర్యాలీలు.. ఇంకా

ట్రెండింగ్ వార్తలు