ఊడిన స్లాబ్ పెచ్చులు : గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 07:31 AM IST
ఊడిన స్లాబ్ పెచ్చులు : గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మరోసారి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. ఆమె చేతికి గాయమైంది. ఆలేరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

మరో ఇద్దరు సర్పంచ్‌‌లకు గాయాలు కావడంతో వారికి కూడా వైద్యులు చికిత్స అందించారు. 2019, డిసెంబర్ 19వ తేదీ ఆలేరులోని R & గెస్ట్ హౌజ్‌లో సర్పంచ్‌లతో ఎమ్మెల్యే సునీత సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా బిల్డింగ్ పెచ్చులు ఊడి కిందపడిపోయాయి.

ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు సర్పంచ్‌లకు గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. గతంలో కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు గొంగిడి సునీత. ఆమె ప్రయాణిస్తున్న కారు..మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా నాగోల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని తప్పించబోయి..ఎదురుగా వస్తున్న మరో వెహికల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సునీత కారు ముదు భాగం దెబ్బతింది. తాను క్షేమంగానే ఉన్నట్లు తర్వాత గొంగిడి సునీత వెల్లడించారు.