MLA Purchase Case : సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు

సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

MLA Purchase Case : సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు

MLA purchase case

MLA Purchase Case : సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసును వాయిదా వేయాలని కోరారు. కేసు వాదనలకు సమయం కావాలని, మరో రోజు విచారణ జరపాలని దవే కోరారు. నిన్న(గురువారం) రాత్రి 9 గంటలకి కేస్ లిస్ట్ చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులపై చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సిట్ దర్యాప్తును పక్కన పెట్టారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు.

సీబీఐ, ఈడీ కూడా ప్రతిరోజు లీకులు ఇస్తున్నాయని చెప్పారు. కేసులో ఆరోపణలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. సీబీఐ వద్దకు ఎలా వెళతామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందని దుష్యంత్ దవే అన్నారు. అయితే, కేసులో ఆధారాలు, వీడియోలు మీడియాకే కాదు..జడ్జీలకు పంపారని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారని ప్రతివాదుల తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా వేశారు.

Revanth Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వారినీ విచారించండి.. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రేవంత్ ఫిర్యాదు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది డిసెంబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్డీ బెంచ్ తీర్పు ఇచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్డీ బెంచ్ ఇచ్చిన తీర్పును ఫిబ్రవరి5న హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్షాలన్నీ విధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి8న హైకోర్టు తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే కేసు వివరాల కోసం సీబీఐ చాలా సార్లు సీఎస్ కు లేఖ రాసింది. సీబీఐ ద్వారా దర్యాప్తు త్వరగా పూర్తి కాదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టుపై ఉత్కంఠ నెలకొంది.