ఎమ్మెల్యే బూతు పురాణం, ఆడియో హల్ చల్

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 05:41 PM IST
ఎమ్మెల్యే బూతు పురాణం, ఆడియో హల్ చల్

MLA Rasamayi Balakishan Audio Tape Goes Viral : అతనో ఎమ్మెల్యే.. రెండోసారి కూడా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. పైగా పీహెచ్‌డీ చేస్తున్నాడు. కానీ నియోజకవర్గం ప్రజలతో మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. మాట్లాడటం అనేకంటే కూడా.. నోరు తెరిస్తే బూతులే వినిపిస్తాయి. మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. తన నియోజకవర్గం పరిధిలోని మరో పార్టీ నేతను దుర్బాషలాడారు. అసభ్యపద జాలంతో దూషించాడు. దీంతో.. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.



ఓ నేతను బూతులు తిట్టిన వ్యవహారం మీడియాలో వైరల్ కావడంతో… ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో ఆడియోను విడుదల చేశారు. తాను ఎక్కడికి వెళ్లాలి అనే విషయం తానే నిర్ణయించుకుంటానన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. బూతులు తిట్టారంటూ రాజశేఖర్ అనే కాంగ్రెస్ నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా విషయాల్లో రెస్పెక్ట్ ఇచ్చినా… రెచ్చగొడుతున్నారంటూ రసమయి ఆ ఆడియోలో చెప్పారు.



ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బూతు పురాణంపై.. బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సమస్యలపై పోరాడుతుంటే.. ఎమ్మెల్యే దుర్బాషలాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే బూతులు తిట్టడమేంటని బాధితుడు రాజశేఖర్ ప్రశ్నిస్తున్నాడు.
https://youtu.be/9lOYchMZSR8