CM KCRs National Party : దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ- ఎమ్మెల్యే రేగా కాంతారావు

దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నడుం బిగించారని ఆయన చెప్పారు.

CM KCRs National Party : దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ- ఎమ్మెల్యే రేగా కాంతారావు

CM KCRs National Party : దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నడుం బిగించారని ఆయన చెప్పారు. ఈ నెల 5న జరగనున్న సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక తీర్మానం చేస్తాం అన్నారు.

”యువత, రైతాంగం, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. ఈ క్రమంలో మనం ఒక గురుతరమైన బాధ్యత వహించాలి అనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు కదిలారు. ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారు” అని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

జాతీయ పార్టీ ఏర్పాటు వైపుగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తాజా రాజకీయ పరిణామాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున(అక్టోబర్ 5) టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

మునుగోడులో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో మన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు.

ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుకి సంబంధించి కీలక విషయాలను సీఎం కేసీఆర్ వివరించినట్లు ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి సత్యవతి రాథోడ్, రేగా కాంతారావు పలు అంశాలను మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోందన్నారు. దసరా రోజు ఉదయం పార్టీకి చెందిన 283 మంది నేతలతో, తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేస్తారని, అనంతరం మధ్యాహ్నం కేసీఆర్ పార్టీని ప్రకటిస్తారని వారు వెల్లడించారు.

కాగా.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు కంటే.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా(భారతీయ రాష్ట్ర సమితి) మార్చడమే మేలనే నిర్ణయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చినట్లు సమాచారం. త్వరలో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫునే తమ అభ్యర్థిని కేసీఆర్ బరిలోకి దింపబోతున్నారు.

భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే దేశంలో పోటీ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారినప్పటికీ, పార్టీకి కారు గుర్తే ఉంటుందని, దానివల్ల ప్రజల్లో ఇబ్బంది ఉండదని కేసీఆర్ చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు అంటే అనేక సమస్యలు వస్తాయని, దాని బదులు పార్టీ పేరు మారిస్తే సరిపోతుందని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. దసరా రోజు మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించబోతున్నారు.

దేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు అవసరాన్ని కేసీఆర్ వివరించినట్లు పార్టీ నేతలు చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు, యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు కొత్త జాతీయ పార్టీ అవసరమని కేసీఆర్ చెప్పినట్లు టీఆర్ఎస్ నేతలు వివరించారు.